Home » Andhra Pradesh » Guntur
గుంటూరులో మహిళలు మద్యం షాపును ముట్టడించారు. మణీ హోటల్ సెంటర్లో ఇళ్ల, ప్రార్థన మందిరాల మధ్య మద్యం షాపు ఉండటంతో స్థానిక మహిళలు త్రీవ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఇవాళ (బుధవారం) సాయంత్రం ఏపీ క్యాబినెట్ సమావేశం అనంతరం ఆయన ఢిల్లీకి వెళ్లారు.
వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ వెంకట రామిరెడ్డికి గుంటూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టాడంటూ అరస్టయిన కేసులో అతడికి రిమాండ్ విధించింది.
ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గొప్ప మైలురాయిగా నిలుస్తుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. భూములు కబ్జా చేసే వారి గుండెల్లో ఈ చట్టం రైళ్లు పరిగెత్తిస్తుందని చెప్పారు.
వైఎస్ఆర్సీపీ తీరు మారలేదు. ఆ పార్టీ శ్రేణులు సోషల్ మీడియాలో కూటమి ప్రభుత్వంలోని కీలక వ్యక్తులను లక్ష్యంగా అభ్యంతరకర పోస్టులు పెడుతున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు... ఆ పార్టీ నేతకుగానీ, ప్రభుత్వంపైగానీ ఆ విమర్శలు చేసినా, పోస్టులను ఫార్వర్డ్ చేసినా ప్రతిపక్షాలు, సామాజిక కార్యకర్తలను పోలీసు, సీఐడీ అధికారులు... అర్థరాత్రి ఇళ్లల్లోకి వచ్చిమరీ అరెస్టులు చేసేవారు.
విశాఖ రుషికొండ ప్యాలెస్లో ఒక్క కబోర్డు కోసం రూ.60 లక్షలు ఖర్చు చేయడంపై సీఎం చంద్రబాబు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఫర్నిచర్, ఫ్లోరింగ్, ఆర్కిటెక్చర్ వంటి పనుల కోసం వందల కోట్లు వెచ్చించారని ఆయన తెలిపారు.
సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని డిప్యూటీ సీఎం మండిపడ్డారు. కొంతమంది పోలీసులు వైసీపీ నేతల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్చకులకు శుభవార్త చెప్పింది. ఎన్నికల హామీ మేరకు వారి వేతనాలను రూ.15వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనను మందలించడంపై కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్ స్పందించారు. చంద్రబాబు తనను తండ్రిలా మందలించారే తప్ప అందులో అపార్థం చేసుకోవాల్సిన విషయం లేదని మంత్రి అన్నారు.
విద్యుత్ ఛార్జీలపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఛార్జీలు పెంచొద్దని ప్రభుత్వాన్ని కోరారు. కూటమి ప్రభుత్వ తీరును నిరసిస్తూ రేపటినుంచి ఆందోళన చేపడుతామని వైఎస్ షర్మిల ప్రకటించారు.