Home » Andhra Pradesh » Guntur
వైసీపీ ప్రభుత్వం ఏపీఎస్ఎఫ్ఎల్కు రూ.1200 కోట్లు అప్పులు చేయడం సహా రూ. 900 కోట్లు బకాయిలు పెట్టిందని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీరెడ్డి ఆరోపించారు. ఏపీ ఫైబర్ నెట్లో అక్రమంగా అర్హత లేకున్నా ఉద్యోగులను నియమించిందని జీవీరెడ్డి అన్నారు.
ప్రభుత్వం మాదిరిగానే ప్రతి ప్రైవేట్ సంస్థ జవాబుదారీతనంతో ఉండాలని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. చట్టాలు తీసుకువస్తే సరిపోదు, అవి యాక్టివ్గా ఉండాలన్నారు. ప్రతి పాఠశాల, కళాశాలలో వినియోగదారుల క్లబ్లు ఏర్పాటు చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
ప్రయాణికులలా నటిస్తూ ఆటోలలో ఒంటరిగా ప్రయాణించే వారిని దోచుకుంటున్న ముఠాల కార్యకలాపాలు మళ్లీ గుంటూరు నగరంలో ఊపందుకున్నాయి. తెనాలి కేంద్రంగా పెద్ద ఎత్తున ఈ తరహా దోపిడీలకు పాల్పడిన గుంటూరు నగరానికి చెందిన పదిమంది ముఠా సభ్యులను ఇటీవల తెనాలి పోలీసులు అరెస్టు చేశారు.
జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద యద్దనపూడి మండల పరిధిలోని పూనూరు--2 గ్రామ సచివాలయాన్ని ఎంపిక చేసి తనిఖీ పూర్తి చేశారు.
బీసీ వెల్ఫేర్పై సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు తిరిగి 34 శాతం రిజర్వేషన్ల సాధనకు న్యాయ పరమైన పోరాటం చేస్తున్నామని అన్నారు. నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
మంత్రి నారా లోకేష్ మరోసారి ఉదారత చాటుకున్నారు. సోషల్ మీడియాలో తన దృష్టికి వచ్చిన సమస్యకు పరిష్కారం చూపించారు. బ్రెయిన్ స్ట్రోక్తో బాధపడుతున్న విద్యార్థినికి లోకేష్ సాయం అందించారు.
పల్నాడు జిల్లా, దాచేపల్లి సమీపంలో ఆదివారం తెల్లవారు జామున జరిగిన ప్రమాదంపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ విచారం వ్యక్తం చేశారు. గొర్రెల కాపరికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు. అలాగే గొర్రెల కాపరులకు న్యాయం చేస్తామని మంత్రి గొట్టిపాటి భరోసా ఇచ్చారు.
పల్నాడు జిల్లా, దాచేపల్లి సమీపంలో ఆదివారం తెల్లవారు జామున ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి గుంటూరు వస్తు్న్న శ్రీ మారుతీ ట్రావెల్స్ బస్సు గొర్రెల మందవైపు దూసుకు వెళ్లింది. 4 వందల గొర్రెలతో వెళుతున్న మందపైకి బస్సు దూసుకుపోయింది.
కాజీపేట - విజయవాడ సెక్షన్లో మోటుమర్రి వద్ద నాన్ ఇంటర్లాకింగ్ పనుల కారణంగా గుంటూరు నుంచి ఆ మార్గంలో ప్రయాణించే పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఏ శ్రీధర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
గుంటూరు నడిబొడ్డున తగిన అనుమతులు లేకుండా నిర్మిస్తున్న గ్రీన్గ్రేస్ హైరైజ్డ్ బిల్డింగ్స్ని కాపాడేందుకు పైస్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయి.