Home » Andhra Pradesh » Krishna
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రసవాల సంఖ్య పెంచాలని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ వాకాటి కరుణ అన్నారు.
మున్సిపల్ డంపింగ్ యార్డులో బుధవారం స్వల్పంగా మంటలు చెలరేగి పొగ కమ్మడంతో స్థానికుల ఫిర్యాదుపై మున్సిపల్ అధికారుల వెంటనే స్పందించారు.
పోరంకిలో పాలడుగు భార్గవ్చౌదరి, బొబ్బా శ్రీకాంత్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే బోడె ప్రసాద్ బుధవారం ఆవిష్కరించారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యసేవలను మరింత మెరుగుపరిచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని, ఆయుష్మాన్ భారత్ రాష్ట్ర బృందం నోడల్ అధికారి డాక్టర్ నరేష్ అన్నారు.
ద్విచక్రవాహనాన్ని ఆర్టీసీ అద్దె బస్సు ఢీకొని వ్యవసాయ కూలీ మరణించాడు.
తీసుకున్న బయానా డబ్బులు తిరిగి ఇవ్వాలన్నందుకు కీసర గ్రామానికి చెందిన వైసీపీ నేత జడ్పీటీసీ ప్రశాంతి భర్త వేల్పుల రమేశ్ తనపై డీజిల్ పోసి నిప్పంటించేందుకు యత్నించాడని కీసర గ్రామానికి చెందిన బాధితుడు అంగిరేకుల రాంబాబు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కిశోరి వికాసం-2 కార్యక్రమం బాలికల బంగారు భవిష్యత్తుకు పునాది వేస్తుందని, ఉజ్వల, ఆరోగ్యకరమైన, సాధికారిత దిశగా ఆమె వేసే అడుగుకు సమిష్టి కృషితో చేయూతనిద్దామని ఎన్టీఆర్ జిల్లా ఇన్చార్జి కలెక్టర్ నిధి మీనా అన్నారు.
నందిగామలో ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్టు ఆర్డీవో బాలకృష్ణ తెలిపారు. డివిజన్ పరిధిలోని ఏడు మండలాల్లో మొత్తం 54 సేకరణ కేంద్రాలు, ఆరుమిల్లలను సిద్ధం చేసింది. బీపీటీ రకం క్వింటాకు రూ.2,320గా నిర్ణయించారు. తేమ శాతం 17 వరకూ ఉండవచ్చని స్పష్టం చేసింది.
ప్రకృతి వైపరీత్యాలకు ఎదురొడ్డి ఆరుగాలం కష్టపడి పండించిన పంట నేలవాలటంతో రైతులు దిగాలు పడుతున్నారు. కోతకు వచ్చిన పంటను కోసేందుకు కూలీల కొరతతో యంత్రాలపై ఆధారపడుతున్నారు. యంత్రాలు కూడా అందుబాటులో లేకపోవటంతో తలలు పట్టుకుంటున్నారు. కోత మిషన్తో కోయిద్దామన్నా భూమిలో గట్టిదనం లేక యంత్రాల చక్రాల కింద పంట నలిగిపోతుండటంతో పొలాలను పంటతో సహా చేలల్లోనే రైతులు వదిలేస్తున్నారు.
మోటారు సైకిళ్ల చోరీ కేసులో ఒకరిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి మూడు మోటారు సైకిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు సీసీఎస్ క్రైం ఏడీసీపీ రాజారావు తెలిపారు.