Home » Andhra Pradesh » Krishna
మచిలీపట్నం పోర్టు నిర్మాణంలో భాగంగా రోడ్డు కం రైలు మార్గాల కోసం భూములిచ్చిన పలువురు రైతుల సహనానికి అధికారులు పరీక్ష పెడుతున్నారు. రెండేళ్ల నుంచి నగదు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయకుండా తిప్పుకొంటున్నారు. భూములు తీసుకునేటప్పుడు అందరికీ పరిహారం ఇస్తామని చెప్పి ఇప్పుడేమో అనేక కారణాలు చెబుతూ కాలయాపన చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు ఇవ్వకుండానే తమ భూముల్లో రహదారి నిర్మా ణం కోసం మెరక చేశారని, దీంతో పంటలు సాగు చేసుకునేందుకు అవకాశం లేకుండా పోయిందని వాపోతున్నారు. అధికారుల పద్ధతి సరికాదని పేర్కొంటున్నారు.
శాశ్వత భూహక్కులు కల్పిస్తామన్న పేరుతో వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ పార్శిల్ మేనేజ్మెంట్ (ఎల్పీఎం) విధానం రైతులకు గుదిబండగా తయారైంది. ఒక భూ యజమానికి ఎన్ని సర్వే నంబర్లలో భూములు ఉన్నా ఒకే ఎల్పీఎం పరిధిలోకి వస్తుంది. ఇటువంటి విధానాన్ని ప్రస్తుత ప్రభుత్వం కూడా కొనసాగిస్తుండటం, ఉమ్మడి జిల్లాలో రీ సర్వే సమగ్రంగా జరగకపోవటం, జరిగిన చోట ల్యాండ్ పార్శిల్స్ విస్తీర్ణం ఎక్కువ, తక్కువగా ఉండటం వంటి కారణాల వల్ల రిజిస్ర్టేషన్స్ పరంగా అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. రైతులు ఇబ్బంది పడటంతో పాటు రిజిస్ర్టేషన్ శాఖ భారీగా ఆదాయాన్ని కోల్పోతోంది. (ఆంధ్రజ్యోతి, విజయవాడ)
దేశానికే వెలుగునిచ్చే కేంద్రంగా ఎన్టీటీపీఎస్కు ప్రత్యేక గుర్తింపు ఉంది. గత వైసీపీ ఐదేళ్ల పాపాలు ఆ ప్లాంటు ప్రతిష్టను మసకబారేలా చేశాయి. ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేశాయి. నేతల ధనదాహం, అధికారుల అలసత్వంతో వెలుగునిచ్చే కేంద్రం కాస్త బూడిద కాలుష్యం వెదజల్లే కేంద్రంగా మారిపోయింది. వైసీపీ అతినీతిని తమకు అంటించుకొని సంస్థ ఉద్యోగులు సైతం బూడిద వ్యాపారులుగా తయారయ్యారు. ఫలితంగా ఎన్టీటీపీఎస్ నుంచి వచ్చే బూడిద కాలుష్యంతో కొండపల్లి, ఇబ్రహీంపట్నంతో పాటు చుట్టు పక్కల ఉన్న శాంతినగర్, ఈలప్రోలు, గుంటుపల్లి, జూపూడి, కిలేశపురం, కేతనకొండ, మూలపాడు, కొటికలపూడి గ్రామాలు, విజయవాడ రూరల్ మండలంలోని పైడూరుపాడు, రాయనపాడు గ్రామాల ప్రజలు ఆస్పత్రుల పాలవుతున్నారు.
ఉరేసుకుని ఓ వస్త్ర వ్యా పారి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఏలూరు రోడ్డులోని ఈఎస్ఐ బస్టాండ్ సెంటర్ ప్రమాదాలకు నిలయంగా మారింది.
కార్తీకమాసాన్ని పుర స్కరించుకుని దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో ఆదివారం సహస్ర లింగార్చన చేశారు.
ఆంధ్రా లయోలా కళాశాల క్రీడా ప్రాంగణంలో నడిచేందుకు యాజమాన్యం అనుమతించాలంటూ ఆదివారం వాకర్స్ అందరూ ఒక్కసారిగా కళాశాల మెయిన్‌గేటు వద్దకు చేరుకున్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఆ శాఖ ఉన్నతాధికారులు ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు శాస్త్రవేత్త ఎల్లాప్రగడ పేరు పెట్టడం హర్షనీయమని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు పవన్ చెప్పారు.
ఏపీ పోలీసుల వరుస చర్యలతో ఉక్కిరి బిక్కిరవుతున్న సోషల్ సైకోలు పలువురు ఏపీని విడిచి పారిపోతున్నారు. మరి కొందరు ఇంకెప్పుడూ ఇలాంటి తప్పులు చెయ్యం. వదిలిపెట్టండి అని పోలీసులను వేడుకుంటున్నారు. ఇంకొందరు భయంతో న్యాయవాదుల్ని వెంట బెట్టుకుని ఠాణాలకు వచ్చి రక్షణ కోరుతున్నారు.
అమరావతి: విజయవాడలో నడక కోసం లయోలా కాలేజ్ వాకర్స్ పోరాటం ప్రారంభించారు. ఈ క్రమంలో లయోలా కళాశాల వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. గత 25 సంవత్సరాలుగా నగరవాసులు లయోలా కాలేజ్ వాకర్స్ పేరుతో లయోలా కాలేజీలో వాకింగ్ చేస్తున్నారు. అయితే కోవిడ్ సాకుతో కాలేజ్ యాజమాన్యం వాకర్స్‌ని కాలేజీలోకి రాకుండా ఆంక్షలు విధించింది.