రాజధానిలో మంత్రి నారాయణ పర్యటించారు. అక్కడి పనులను పరిశీలించారు. 11, 8 జోన్లలో పనులు తొందరలోనే ప్రారంభించినున్నట్లు మంత్రి తెలిపారు.
మంత్రి నారా లోకేష్ అమోరికా పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా ఓప్స్ ర్యాంప్ సీఈవో వర్మతో భేటీ అయిన మంత్రి లోకేష్... ఐటీ, మౌలిక సదుపాయాలకు మద్దతు ఇవ్వాలని కోరారు.
మడ అడవులను ఇష్టానుసారంగా నరికేస్తున్న అక్రమార్కులు మరిన్ని దారుణాలకు తెగబడుతున్నారు. చెట్ల నరికివేత, రొయ్యల చెరువుల తవ్వకాల పరిశీలనకు వచ్చే తనిఖీ బృందాలను అడ్డుకోవటానికి రోడ్లకు గండ్లు కొడుతున్నారు.
‘డౌన్.. డౌన్.. పోలీస్’ అంటూ భవానీ మాలధారులు నిరసన వ్యక్తం చేశారు. మాలలో ఉన్న తమపై విచక్షణ కోల్పోయి దాడి చేసిన కానిస్టేబుల్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
విజయవాడ ఏ1 రైల్వేస్టేషన్‌ను ప్రధాన రూట్లకు దూరం చేయాలని రైలే ్వబోర్డు ఆలోచన చేస్తుందా? ఈ ఆలోచన బెజవాడ ప్రజలకు ముఖ్యమైన రైల్వేరూట్లను దూరం చేస్తుందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. రైల్వే అధికారులు తాజాగా వేస్తున్న అడుగులు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి.
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో తాజాగా నలుగురు నిందితులకు కస్టడీకి పంపిస్తూ న్యాయస్థానం ఆదేశాలిచ్చింది.
ఇండిగో సంక్షోభం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. పైలట్లకు తగినంత విశ్రాంతినివ్వాలని చెప్పిన ఆయన.. ఇండిగో సంస్థ ప్రమాణాలను పాటించడంలో విఫలమైందన్నారు.
సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమపాళ్లలో చేపట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 18 నెలలుగా ప్రతి గంట, ప్రతి క్షణం కష్టపడ్డామన్నారు. 93 స్కీంలను మరలా రివైవ్ చేసినట్లు తెలిపారు.
ఇసుక కుంభకోణం కేసుకు సంబంధించి సుప్రీంలో జేపీ వెంచర్స్ ఐఏ దాఖలు చేసింది. ఎన్జీటీ విధించిన జరిమానాను తాము చెల్లించాల్సిన అవసరం లేదంటూ సుప్రీంలో జేపీ వెంచర్స్ వాదనలు వినిపించింది.
రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఫ్లవర్ ఎక్స్పో డిసెంబరు 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. ఫ్లవర్ ఎక్స్‌పోకు పలు ప్రపంచ దేశాల నుంచి కూడా మొక్కలను తీసుకువచ్చి ప్రదర్శించారు.