గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేత వల్లభనేని వంశీమోహన్‌కు బిగ్ షాక్ తగిలింది. వంశీ ప్రధాన అనుచరుడు కొమ్మా కోట్లును విజయవాడ పటమట పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు.
మచిలీపట్నంలో ఎన్టీఆర్ సర్కిల్ వివాదాస్పదంగా మారింది. గత రెండు రోజుల క్రితం హౌసింగ్ బోర్డు రింగ్‌కు దివంగత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి సర్కిల్ అని నామకరణం చేసి ప్లెక్సీలు ఏర్పాటు చేశారు బీజేపీ నేతలు. అయితే ఈ విషయంపై టీడీపీ నేతలు అభ్యంతరం చెబుతున్నారు.
పరకామణి విషయంలో జగన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. లక్షల కోట్లు దోచుకున్న జగన్‌కు ఇది చిన్న తప్పే కావచ్చని వ్యంగాస్త్రాలు సంధించారు. వైకాపా నేత పేర్ని నానికీ కౌంటర్ ఇచ్చారు.
యువతలో స్ఫూర్తి నింపేందుకు క్రీడా పోటీలు నిర్వహించాలని విజయవాడ ఎంపీ కేశినేని నాని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇలాంటి నేషనల్ లెవల్ గేమ్స్ కాంపిటేషన్స్ మరెన్నో జరగాలని ఆయన ఆకాంక్షించారు.
ఏపీ పురోగతి చెందడానికి, దేశంలోనే ప్రథమ స్థానానికి రావడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పని చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ వివరించారు. రాయలసీమను ఒక పవర్ హౌస్‌గా అభివృద్ధి చేయనున్నారని చెప్పుకొచ్చారు.
ఇన్‌స్టాలో ఓ రీల్ కోసమే సస్పెక్ట్ షీటర్ అలవల నవీన్‌రెడ్డిని గద్దె సాయికృష్ణ అలియాస్ పిల్ల సాయి హత్య చేశాడా? అంటే అవుననే సమాధానమే వస్తుంది. సాయి పుట్టినరోజు సందర్భంగా గురువారం రాత్రి ధర్మవరప్పాడు తండా చప్టాపై మందు పార్టీ చేసుకున్నారు.
స్క్రబ్ టైఫస్ ఉమ్మడి కృష్ణాజిల్లాను కలవరపెడుతోంది. కృష్ణాజిల్లాలో 15 కేసులు, ఎన్టీఆర్ జిల్లాలో రెండు కేసులు నమోదయ్యాయి. ఇవికాకుండా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈ లక్షణాలతో బాధపడుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది.
విజయవాడ రైల్వేస్టేషన్లో పార్కింగ్ ఫీజులు ప్రయాణికులకు తలకుమించిన భారంగా మారుతున్నాయి. రోజుకు రెండు లక్షల మంది రాకపోకలు సాగించే అతిపెద్ద రైల్వేస్టేషన్లో పార్కింగ్ చేయాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఊరెళ్లి రావడం కంటే కూడా రైల్వేస్టేషన్లో ద్విచక్రవాహనాలను పార్కింగ్ చేస్తే ప్రయాణ టికెట్‌కు మించి ఎక్కువ ధర చెల్లించాల్సి వస్తోంది. ప్రీమియం పేరుతో గంటకు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. నాన్ ప్రీమియం పేరుతో గంటలకు లెక్కలు కట్టి మరీ డబ్బు పిండుతున్నారు.
విజయవాడ నకిలీ మద్యం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఎనిమిది మంది నిందితులపై ఎక్సైజ్ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో పలువురు నిందితుల పాత్రను ఛార్జిషీట్ లో సిట్ అధికారులు వివరించారు.
మావోయిస్టు పార్టీ అగ్రనేత హిడ్మా ఎన్‌కౌంటర్‌తో బెజవాడ వ్యాపారులకు సంబంధాలున్నాయన్న ఆ పార్టీ ప్రకటనతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎవరా వ్యాపారులు..? అనే అంశం చర్చనీయాంశంగా మారింది. హిడ్మా అనారోగ్యానికి గురయ్యాడని, చికిత్స కోసం నిరాయుధుడై విజయవాడ వచ్చాడని, అందుకు ఆ ఇద్దరు వ్యాపారులు సహకరించారని, వీరితో పాటు తమ పార్టీ సభ్యుడు ఒకరు పోలీసులకు సమాచారం ఇవ్వటం వల్లే హిడ్మా విజయవాడలో పట్టుబడ్డాడని, హత్య చేసి మారేడుమిల్లిలో ఎన్కౌంటర్ అని చెప్పారని ఆ ప్రకటనలో పేర్కొనడం సంచలనం సృష్టిస్తోంది. మావోయిస్టు పార్టీకి సహకరించిన ఆ ఇద్దరు వ్యాపారులు ఎవరు? అనేది చర్చకు దారితీస్తోంది.