Home » Andhra Pradesh » Nellore
నెల్లూరు జిల్లాలో కలకలం రేపిన ట్రాన్స్జెండర్ హాసిని హత్య కేసులో ఎస్పీ కృష్ణకాంత్ సంచలన విషయాలు వెల్లడించారు. ట్రాన్స్జెండర్ల మధ్య ఆధిపత్య పోరే హత్యకి కారణమని ఆయన తెలిపారు. ఈ కేసులో 12 మందిని అరెస్టు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు.
ప్రజలని ఇబ్బంది పెట్టడం ప్రభుత్వ ఉద్దేశం కాదని.. అభివృద్ది కోసమే పన్నుల వసూలు అని మంత్రి నారాయణ తెలిపారు. ఏపీ వ్యాప్తంగా పన్నుల చెల్లింపు విధానం ఒకేలా ఉంటుంది. నెల్లూరుకి ప్రత్యేకమేమీ ఉండదని స్పష్టం చేశారు.
ప్రపంచ ఆర్థిక నేరగాడు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి పరువెక్కడ ఉందని ఏపీ ఆక్వా కల్చర్ అథారిటీ చైర్మన్ ఆనం వెంకట రమణా రెడ్డి ప్రశ్నించారు. ఆయన పరువు నష్టం దావా వేస్తాననడం హాస్యాస్పదంగా ఉందని ఆనం వెంకట రమణా రెడ్డి విమర్శించారు.
సభా నాయకుడిపైనే ఇలాంటి కుట్ర జరిగితే మరి మామూలు జనం పరిస్థితి ఏంటనేది ఆలోచించాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఈ అంశాన్ని సీరియస్గా తీసుకోవాలన్నారు. ఇది ముఖ్యమైన అంశమని, దీనిపై తప్పనిసరిగా చర్చించాలని డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు కూడా అన్నారు.
జగన్ను చూసి చాలా రోజులు అవుతుంది.. కానీ ఆయన మాత్రం అసెంబ్లీకి రావడం లేదని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. దీనికి పరిష్కారం ఏంటంటే.. రోజుకు జగన్కు గంట మాట్లాడేందుకు సమయం ఇస్తే వస్తారన్నారు. ఇంకొ విషయం ఏంటంటే.. ఆయన ఏం మాట్లాడినా అద్దం రాకూడదని.. ఇది జగన్ ఫిలాసఫీ అని అన్నారు.
తప్పయిపోయింది. తనను క్షమించాలంటూ వైఎస్సార్సీపీ సానుభూతి పరురాలు, సినీ నటి శ్రీరెడ్డి వేడుకుంటున్నారు. ఈ క్రమంలో మంత్రి నారా లోకేష్కు విజ్ఞప్తి చేస్తూ ఓలేఖను సామాజిక మధ్యమం ఎక్స్లో శ్రీరెడ్డి పోస్టు చేశారు. జగన్ హయాంలో ప్రతిపక్ష నేతలైన చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కల్యాణ్, వంగలపూడి అనితపై సోషల్ మీడియా వేదికగా ఆమె అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
Andhrapradesh: ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై అసత్య ఆరోపణలు, కార్టూన్లను సోషల్ మీడియాలో ప్రచారం చేయడంపై కాకణిపై కేసు నమోదు అయ్యింది. ఈ క్రమంలో పది రోజుల క్రితమే విచారణకు హాజరుకావాలని మాజీమంత్రికి కృష్ణపట్నం సర్కిల్ పోలీసులు నోటీసులిచ్చారు. దీంతో ఈరోజు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో భవన నిర్మాణాల అనుమతులకు నూతన విధానాన్ని తీసుకువస్తున్నట్లు ఏపీ పట్టణ, మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు.
ఏపీలో జరుగుతున్న లైంగిక వేధింపులపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కఠిన చర్యలు తీసుకుంటున్న నేరస్తుల్లో మార్పు రావడం లేదని పవన్ కల్యాణ్ అన్నారు.
రబీ సీజన్లో 8లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని తీర్మానం చేసినట్లు మంత్రి నారాయణ తెలిపారు. సోమశిల నుంచి 55.100 టీఎంసీల నీటిని 5.51లక్షల ఎకరాలకు, కండలేరు నుంచి 22.600 టీఎంసీలతో 2.26లక్షల ఎకరాలకు సాగు నీరు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు.