Home » Andhra Pradesh » Nellore
విజయసాయి, అతని వియ్యంకుడు సగం రాష్ట్రాన్ని దోచేశారని సర్వేపల్లి ఎమ్మెల్యే, తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. ఇక కేంద్ర మంత్రి అయితే ఈ రాష్ట్రంలో ఏం మిగిలేది కాదని సోమిరెడ్డి విమర్శించారు.
జిల్లా అభివృద్ధి కమిటీ సమీక్ష సమావేశంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అవమానం జరిగింది. స్వాగత కార్యక్రమంలో మంత్రులకు మాత్రమే అధికారులు బొకేలు అందజేశారు. ఈ వేదికపై ఎంపీ వేమిరెడ్డి ఉన్నప్పటికీ అధికారులు విస్మరించారు.
వైసీపీ హయాంలో ఇసుక ట్రాక్టర్లకు లోడ్ చేసేవాళ్ళు కాదని, టిప్పర్లు లోడ్ చేసేవాళ్ళని ఎమ్మెల్యే కోటంరెడ్డి అన్నారు. ఎందుకంటే ట్రాక్టర్లు పేదోళ్ళవి.. టిప్పర్లు ముఖ్యమంత్రివి.. ఇసుక టిప్పర్లు టచ్ చేస్తే సీఎం కార్యాలయం నుంచి కాల్ చేసే వాళ్లని.. ఎస్పీలు, కలెక్టర్లు ఏజంట్లుగా పని చేశారని ఆరోపించారు. అందుకే 11 సీట్లు ఇచ్చి జనం ఛీ కొట్టారన్నారు.
జిల్లాకు ఎంతో అవసరమైన దగదర్తి విమానాశ్రయ పనులు కూడా త్వరలో ప్రారంభిస్తామని ఏపీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. జిల్లాలో పరిశ్రమలు, విమానాశ్రయ ఏర్పాటుపై వివిధ శాఖల అధికారులతో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, డాక్టర్ పొంగూరు నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు.
తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం నాంచారంపేటలో వైసీపీ మూకలు రెచ్చిపోయాయి. చెలగల కాటయ్య అనే టీడీపీ కార్యకర్త ఇంటిపై వైసీపీకి చెందిన దుంపల మధు, అతని అనుచరులు దాడి చేశారు.
ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఛానల్‌తో మాట్లాడుతూ ఏపీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. తన నివాసంలో పార్టీ శ్రేణులతో అంతర్గత సమావేశాలు నిర్వహిస్తున్నామని, అయితే వైసీపీ ఎంపీటీసీ ఒకరు స్వామి మాలలో నేరుగా సమావేశంలో చొరపడ్డాడని మంత్రి చెప్పారు.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నిన్న (శనివారం) సాయంత్రం తన స్వగృహంలో మండలాల వారీ సమావేశాలు చేపట్టారు.
రాష్ట్రంలో భారీ వర్షాలపై ప్రస్తుత పరిస్థితిని ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు ముఖ్యమంత్రికు వివరించారు. ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడినట్లు జిల్లాల అధికారులు తెలిపారు.
అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష జరిపారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిన్నటి (మంగళవారం) నుంచి నెల్లూరు సహా పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలపై అధికారులతో సీఎం సమీక్షించారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా నెల్లూరు జిల్లాలో పరిస్థితిపై జిల్లా కలెక్టర్ ఆనంద్, రెవెన్యూ, పోలీసు అధికారులతో దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు.