Home » Andhra Pradesh
టీడీపీ బలోపేతానికి అన్ని ఆర్గనైజేషన్లలో పార్టీ నాయకత్వాన్ని నియమిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అభివృద్ధికి నాంది పలుకుతున్నాం. సుపరిపాలనకు ప్రాధాన్యతనిస్తున్నామని చెప్పారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని తప్పులు చేసిన వారిని చట్టపరంగా శిక్షపడేలా చేస్తామని హెచ్చరించారు.
ప్రస్తుత డిప్యూటీ స్పీకర్, ఉండి తెలుగుదేశం ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజును అక్రమంగా అరెస్టు చేసి.. థర్డ్ డిగ్రీ ప్రయోగించిన కేసులో సీఐడీ రిటైర్డ్ ఏఎస్పీ విజయపాల్‌ను మంగళవారం రాత్రి ఒంగోలు ఎస్పీ దామోదర్ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో విజయ్ పాల్‌కు గుంటూరు కోర్టు రిమాండ్ విధించింది.
ఏపీపై తుఫాన్ ప్రభావం కనిపిస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర వాయుగుండం క్రమంగా బలపడి తుఫాన్ గా మారనుంది. శ్రీలంక తీరాన్ని అనుకొని తమిళనాడు వైపు పయనిస్తుంది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రశంసల వర్షం కురిపించారు. మోదీకి పని పట్ల నిబద్ధత, భారతదేశం పట్ల ప్రేమ నిజంగా స్ఫూర్తిదాయకమని కొనియాడారు.
అమరావతి రైల్వే లైన్ వెళ్ళే పలు గ్రామాల రైతులు, స్థానిక ఎమ్మెల్యే లతో మంత్రి నారాయణ సమావేశం అయ్యారు. రైల్వే లైన్ కోసం భూసేకరణ కింద కాకుండా ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు తీసుకోవాలని రైతులు కోరినట్లు తెలుస్తోంది.
పరవాడ ఫార్మాసిటీలో ప్రమాద బాధితులకు అందుతున్న వైద్య సాయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. బాధితులకు ప్రభుత్వ పరంగా అండగా ఉండాలని అధికారులకు ఆదేశించారు.
సాస్కి పథకం ద్వారా విడుదలైన నిధులతో అఖండ గోదావరి, గండికోటను అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాబోయే ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పర్యాటక రంగంలో నెంబర్ 1 గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు.
దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న జగన్, అదానీ వ్యవహారంలో సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆఘ మేఘాలపై విద్యుత్‌పై కుదిరిన అనుబంధం.. ఒప్పందాల గుట్టు రట్టయింది. మంత్రి వర్గం ఆమోదం లేకుండానే రెండు అనుబంధ విద్యుత్ విక్రయ ఒప్పందాలు జరిగిన విషయం బయటకు వచ్చింది.
డీఎస్సీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త సిలబస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ సిలబస్ ప్రకారం ప్రిపేర్ అయ్యేందుకు అభ్యర్థులు సన్నద్ధం అవుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తన ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. దాదాపు అరగంట పాటు ప్రధానితో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలతోపాటు తాజా రాజకీయ పరిణామాలపై వీరిరువురు చర్చించినట్లు తెలుస్తుంది.