Home » Andhra Pradesh
అమరావతి రైల్వే లైన్ వెళ్ళే పలు గ్రామాల రైతులు, స్థానిక ఎమ్మెల్యే లతో మంత్రి నారాయణ సమావేశం అయ్యారు. రైల్వే లైన్ కోసం భూసేకరణ కింద కాకుండా ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు తీసుకోవాలని రైతులు కోరినట్లు తెలుస్తోంది.
పరవాడ ఫార్మాసిటీలో ప్రమాద బాధితులకు అందుతున్న వైద్య సాయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. బాధితులకు ప్రభుత్వ పరంగా అండగా ఉండాలని అధికారులకు ఆదేశించారు.
సాస్కి పథకం ద్వారా విడుదలైన నిధులతో అఖండ గోదావరి, గండికోటను అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాబోయే ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పర్యాటక రంగంలో నెంబర్ 1 గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు.
దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న జగన్, అదానీ వ్యవహారంలో సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆఘ మేఘాలపై విద్యుత్పై కుదిరిన అనుబంధం.. ఒప్పందాల గుట్టు రట్టయింది. మంత్రి వర్గం ఆమోదం లేకుండానే రెండు అనుబంధ విద్యుత్ విక్రయ ఒప్పందాలు జరిగిన విషయం బయటకు వచ్చింది.
డీఎస్సీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త సిలబస్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ సిలబస్ ప్రకారం ప్రిపేర్ అయ్యేందుకు అభ్యర్థులు సన్నద్ధం అవుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తన ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. దాదాపు అరగంట పాటు ప్రధానితో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలతోపాటు తాజా రాజకీయ పరిణామాలపై వీరిరువురు చర్చించినట్లు తెలుస్తుంది.
అవినీతి చేయడంలో తనను మించిన వారు లేరని ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరోసారి నిరూపించారని ఏపీ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్ ఆనం వెంకట రమణారెడ్డి అన్నారు. పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ విద్యుత్ కొనుగోళ్లలో జగన్ రెడ్డికి 200 మిలియన్ డాలర్ల లంచం ముట్టిందని ఆనం ఆరోపించారు.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రధాన అనుచరుల్లో ఒకరైన గుర్రం నాని.. భవన నిర్మిణ కార్మికులకు నగదు చెల్లింపులు చేయ్యకుండా ఎగకొడుతున్నారు. ఈ నేపథ్యంలో వారు రహదారిపై ఆందోళనకు దిగారు.
కస్టోడియల్ టార్చర్ కేసులో సీఐడీ మాజీ ఏఎస్పీ విజయ్ పాల్ అరెస్ట్ హర్షించదగ్గ విషయమని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు. ఈ కేసులో అసలు కుట్రదారు ఏపీ సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్ అని రఘురామ చెప్పారు.
ప్రముఖ దర్శకుడు రాం గోపాల్ వర్మ.. ఒంగోలు పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ ఏపీ హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ బుధవారం విచారణకు రానుంది.