Ram Gopal Varma: కొనసాగుతున్న గాలింపు.. వర్మ పిటిషన్‌పై నేడు విచారణ
ABN , Publish Date - Nov 27 , 2024 | 11:29 AM
ప్రముఖ దర్శకుడు రాం గోపాల్ వర్మ.. ఒంగోలు పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ ఏపీ హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ బుధవారం విచారణకు రానుంది.
అమరావతి, నవంబర్ 27: సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తోపాటు ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టింగులు పెట్టిన కేసులో ప్రముఖ దర్శకుడు రాం గోపాల్ వర్మ.. పోలీసుల కన్ను కప్పి అజ్జాతంలోకి వెళ్లారు. హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లో ఆయన నివాసానికి పోలీసులు వెళ్లారు. అయితే ఆయన ఇంట్లో లేరంటూ సెక్యూరిటీ సిబ్బంది జవాబు ఇచ్చారు. దీంతో వర్మ కోసం.. గత రెండు రోజులుగా ఆరు పోలీస్ బృందాలు జల్లెడ పడుతున్నాయి. అజ్జాతంలో ఉన్న డైరెక్టర్ రాం గోపాల్ వర్మ కోసం.. తమిళనాడు, కేరళతోపాటు తెలంగాణలో సైతం పోలీసులు గాలిస్తున్నారు.
Also Read: యూఎస్‌లో కేసులపై క్లారిటీ ఇచ్చిన అదానీ గ్రూప్
మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో రాం గోపాల్ వర్మపై ఇప్పటి వరకు మొత్తం 9 కేసులు నమోదయ్యాయి. అయితే తాను ఎక్కడికి పారిపోలేదంటూ వర్మ... మంగళవారం ఓ వీడియో సోషల్ మీడియాలో వదిలారు. విచారణకు ఏ మాత్రం సహకరించకుండా.. రాంగోపాల్ వర్మ అజ్జాతంలోకి వెళ్లడంపై ప్రకాశం జిల్లా పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకోవైపు బుధవారం అంటే.. ఈ రోజు మధ్యాహ్నం రాంగోపాల్ వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది.
Also Read: మళ్లీ వార్తల్లో నిలిచిన బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక
గత ప్రభుత్వ హయాంలో.. రాం గోపాల్ వర్మ రెచ్చిపోయారు. ఆ సమయంలో టీడీపీ అధినేత, నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడితోపాటు ఆయన కుమారుడు నారా లోకేశ్, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై సోషల్ మీడియాలో తీవ్ర అభ్యంతరకర ఫోటోలు పోస్ట్ చేసి.. వాటిని దారుణాతి దారుణంగా మార్ఫింగ్ చేశారు. ఈ నేపథ్యంలో వర్మపై ఒంగోలు పోలీస్ స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ క్రమంలో తమ విచారణకు హాజరు కావాలంటూ అతడికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. అందుకు వారం రోజులు గడువు సైతం కోరాడు. అందుకు పోలీసులు సానుకూలంగా స్పందించారు. ఆ తర్వాత అతడు పోలీస్ విచారణకు హాజరుకాలేదు. దీంతో అతడి కోసం పోలీసులు ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టారు.
Also Read: మజ్జిగ వల్ల ఇన్ని లాభాలున్నాయా..?
ఇంకోవైపు తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ.. అతడు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్‌పై నేడు విచారణ జరగనుంది.
ఈ ఏడాది మే, జూన్ మాసంలో.. చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. అనంతరం గత ప్రభుత్వ హయంలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలు వెలుగులోకి తీసుకు వచ్చేందుకు చర్యలు చేపట్టాంది. అలాగే గతంలో నాటి ప్రతిపక్ష పార్టీల నేతలను లక్ష్యంగా చేసుకుని ఓ విధమైన సైకో ఇజాన్ని ప్రదర్శించిన నేతలపై ఈ కూటమి ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించిన సంగతి తెలిసిందే.
For AndhraPradesh News And Telugu News