Home » Andhra Pradesh » Prakasam
గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు, మంగు వాతావరణంతో నేతన్నల మగ్గాలు ఆగాయి. పని కుంటుపడింది. చేనేత ఉపవృత్తుల పనులు ఆగాయి. దీంతో రోజువారీ మజూరీతో జీవనం సాగించే సగటు చేనేత కార్మికులు భృతికి ఇబ్బంది పడుతున్నారు.
ఆంధ్రజ్యోతిలో ఈ నెల 3వ తేదీన అధికారులకు కనిపించని ఇసుక తవ్వకాలు, రవాణా అన్న శీర్షికన ప్రచురితమైన కథనంపై మైనింగ్ ఏడీ రాజే్షకుమార్ స్పందించారు. ఆ నేపథ్యంలో తమ కార్యాలయం నోటీ్సకు వచ్చిన అన్ని ప్రదేశాలను తనిఖీచేసి, అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాకు ప్పాల్పడిన వ్యక్తులపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని గురువారం ప్రకటనలో తెలిపారు.
చీరాల ఏరియా వైద్యశాల పలు ప్రైవేటు ఆసుపత్రులకన్నా మిన్నగా ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే వైద్యులు, సిబ్బంది ఖాళీల భర్తీ అనివార్యం. దీంతో పాటు వైద్యులు, సిబ్బంది రోగుల పట్ల ప్రేమతో మెలగాలి. సేవా భావం ఉండాలి. రాజకీయ నాయకులు, మీడియా తదితర సిఫార్సులను ఒకింత పక్కన పెట్టాలి. అందుకు సంబంధీకులకు స్వీయ నియంత్రణ ఉండాలి. ఆసుపత్రికి వచ్చిన రోగి వ్యాధిని బట్టి ప్రాధాన్యత ఇవ్వాలి. అప్పుడే ఏరియా వైద్యశాలపై ఉన్న అపోహలు తొలుగుతాయి. నిరుపేదలకు పారదర్శమైన వైద్యసేవలు అందుతాయి. అందుకు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మెప్మాలో కొందరురిసోర్స్ పర్సన్(ఆర్పీ)లు ఇష్టారాజ్యంగా పనిచేస్తున్నారు. పొదుపు సభ్యులకు అందుబాటులో ఉండి సంఘాల బలోపేతానికి అవసరమైన సమావేశాలు నిర్వహించాల్సిన వీరు రూటుమార్చి అక్రమార్జనే ధ్యేయంగా బ్యాంకులను బురిడీ కొట్టిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నగరంలో నకిలీ గ్రూపులు సృష్టించి కోట్లు గోల్మాల్ చేసిన విషయం విదితమే.
జిల్లా పంచాయతీ కార్యాలయం పరిధిలో పనిచేసే ఉద్యోగుల బదిలీల్లో అవినీతి, అక్రమాలకు పాల్పడిన పూర్వపు ఇన్చార్జి డీపీవో టి.ఉషారాణిని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
దక్షిణాది ప్రాంతంలో పొగాకు పండించే ప్రతి రైతు ఈ ఏడాది పంట సాగు, ఉత్పత్తిలో స్వీయ నియంత్రణ పాటించాలని రైతు ప్రతినిధులు కోరారు. అందుకు విరుద్ధంగా వ్యవహరించి గడిచిన రెండేళ్ల ధరలు చూసి మురిసిపోయి ఎక్కువ పంటను ఉత్పత్తి చేస్తే అందరూ నష్టపోతారని హెచ్చరించారు.
జిల్లాలో ఈనెల 14వ తేదీ నుంచి వారం రోజులపాటు బంగారు బాల్యం కార్యక్రమం కింద బాలోత్సవాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. ఈ వారోత్సవాల నిర్వహణ, భాగస్వామ్యం, ఏర్పాట్లపై బుధవారం కలెక్టరేట్ నుంచి మండల స్థాయి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు.
జిల్లా యువజన సంక్షేమశాఖ (స్టెప్) ఇన్చార్జి ముఖ్య కార్యనిర్వహణాధికారిగా పి.శ్రీమన్నారాయణ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ ఫారెస్టు సెటిల్మెం ట్ ఆఫీసర్ లోకేశ్వరరావు ఇన్చార్జిగా ఉన్నారు.
వేటపాలెం మండలం రామా పురంలోని సాలిడ్ వేస్ట్మేనేజ్ యూనిట్లో వస్తున్న పొగ, యంత్రాల పని తీరును చీరాల మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ రషీద్ బుధవారం పరిశీలించారు. ఆంధ్రజ్యోతిలో బుధవారం కమిష నర్గారూ ఈ పొగ మా టేంటి అన్న శీర్షికన ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. మున్సిపల్ ఏఈ, ఇన్ స్పెక్టర్లతో కలసి రామాపురంలోని సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ను సందర్శించా రు.
సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం జేఎన్టీయూ (కాకినాడ) ఇంటర్ కళాశాలల వెయిట్ లిఫ్టింగ్ పోటీలు, యూనివర్సిటీ టీం ఎంపికలను కళాశాల సెక్రటరీ వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు ప్రారంభించారు. డాక్టర్ కొండలరావు అతిథిగా హాజరయ్యారు.