Home » Andhra Pradesh » Prakasam
గ్రామసభల ద్వారా భూసమస్యలు పరిష్కారించేందుకు వీలుం టుందని తహసీల్దార్ కృష్ణారెడ్డి అన్నారు.
రాష్ట్ర మంత్రుల బృందం మంగళవారం చేపట్టిన వెలిగొండ ప్రాజెక్టు సందర్శన పండుగ వాతావరణాన్ని తలపించింది.
ప్రజల నుంచి వచ్చిన అర్జీల తక్షణ పరిష్కారమే ప్రజా సమస్యల పరిష్కార వేదిక ల క్ష్యం అని చీరాల ఆర్డీవో చంద్రశేఖరనాయు డు అన్నారు. అద్దంకి తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ఆర్డీఓ చం ద్ర శేఖరనాయుడు హాజరై అర్జీలను స్వీకరించారు.
చీరాల మునిసిపల్ కమిషనర్ సయ్యద్ అబ్దుల్ రషీద్ పీఎం స్వానిధి పథకానికి సంబంధించి రాష్ట్రస్థాయి అవార్డు తీసుకున్నారు.
దర్శి పట్టణంలో టీడీపీ ఫ్లెక్సీలు చించివేసిన సంఘటన కలకలం రేగింది. నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ఫొటోలతో ఉన్న ఫ్లెక్సీలను ఎవరో కోసి చించివేశారు.
Andhrapradesh: వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాకుండానే జగన్ జాతికి అంకితం చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఐదేళ్ళ పాలనలో జగన్ మొద్దు నిద్ర పోయారని విమర్శించారు. ఐదేళ్ళలో రూ.170 కోట్లు మాత్రమే జగన్ వెలిగొండ ప్రాజెక్టుకు ఖర్చు చేశారని తెలిపారు.
జగన్ పాలన వెలిగొండ ప్రాజెక్టుకు శాపంగా మారిందని, టన్నెల్స్, ఫీడర్ కెనాల్, రిజర్వాయర్ పనులు, నిర్వాసితులకు 880 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉండగా, ఒక రూపాయి కూడా జగన్ ఇవ్వలేదని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. ఎన్నికల ముందు వెలుగొండ జాతికి అంకితం అనడం, జగన్ మార్క్ మోసం.. దగా అని దుయ్యబట్టారు.
జిల్లాలో సాగునీటి రంగం ప్రభుత్వ సాయం కోరుతోంది. గత వైసీపీ పాలనలో జరిగిన నిర్లక్ష్యం ప్రజలకు శాపంగా మారింది. వెలిగొండపై మాటలు తప్ప చేతలు లేవు. నిధులు ఇవ్వ లేదు. నిర్వాసితులను తరలించ లేదు. కృష్ణానది నుంచి నీటిని తీసుకునే అవకాశం ఉన్నా పట్టించుకోలేదు. గుండ్లకమ్మ గేట్లకు మరమ్మతులను కూడా గాలికొదిలేసింది.
ఉమ్మడి జిల్లాలో కీలకమైన జిల్లా పరిషత్ చేజారకుండా చూసుకునేందుకు వైసీపీ క్యాంపు రాజకీయానికి శ్రీకారం చుట్టింది. అమల్లో ఉన్న నిబంధనల మేరకు మరో ఎనిమిది నెలలు దాటితే ప్రస్తుత జడ్పీ చైర్‌పర్సన్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు అవకాశం ఉంది.
మునిసిపల్ యాజమాన్యంలోని పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి ప్రమోషన్ల షెడ్యూల్‌ను ప్రకటించింది. ఇటీవల జరిగిన చర్చల్లో వెంటనే ఉద్యోగోన్నతులు ఇస్తామని యూనియన్ నేతలకు పాఠశాల విద్య కమిషనర్ విజయరామరాజు హామీ ఇచ్చారు.