అట్టహాసంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన పౌరస ఫరాల శాఖ అధికారులు కొనుగోళ్లను మరిచారు. వారి నిర్లక్ష్యం కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పండించిన ధాన్యాన్ని ఎక్కడ విక్రయించాలో దిక్కుతోచక అయోమంలో ఉన్నారు.
జిల్లా ప్రజలను స్క్రబ్ టైఫస్ కలవరపెడుతోంది. గతంలో కూడా అడపాదడపా ఈ కేసులు నమోదైనప్పటికీ ప్రాణాంతకంగా ఉండేది కాదు. కానీ ఇప్పుడు వ్యాధి మరింత విజృంభిస్తుండటం తోపాటు ప్రాణాలు కోల్పోతుండటం ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది.
పైళ్ల పరిష్కారం విషయంలో రాష్ట్ర మంత్రివర్గంలోనే డాక్టర్ డోలా బాలవీరాంజనేయస్వామి ముందు వరసలో ఉన్నారు. అధికార యంత్రాంగంలో జిల్లాలో కీలకమైన కలెక్టర్ రాజాబాబు నెమ్మదిగా ఉన్నారు.
జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ)లో ప్రభుత్వ ఆదేశాలతో సెక్షన్ 51 విచారణ చేస్తున్న సహకారశాఖ అడిషనల్ కమిషనర్ గౌరీశంకర్ మరోసారి విచారణకు వచ్చారు. అయితే ఈసారి కూడా ప్రక్రియ మొక్కుబడిగానే సాగుతున్నట్లు తెలుస్తోంది.
టీచర్స్ ఎలిజిబులిటీ టెస్ట్ (ఏపీ టెట్) బుధవారం ప్రశాంతంగా జరిగింది. జిల్లాలో 8 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షకు ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లు ఉండగా మొదటి రోజైన బుధవారం ఉదయం సెషన్ మాత్రమే నిర్వహించారు.
రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెలిగొండ ప్రాజెక్ట్ పనుల పరిశీలన కోసం గురువారం దోర్నాలకు రానున్నారు. రాత్రికి అక్కడ బస చేస్తారు. శుక్రవారం ఉదయం 8.30 గంటలకు దోర్నాల నుంచి బయల్దేరి కొత్తూరు వద్ద వెలిగొండ ప్రాజెక్ట్ టన్నెళ్లను పరిశీలిస్తారు.
పేదవారి ఆకలి తీర్చడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి చెప్పారు. స్థానిక అన్నా క్యాంటీన్‌ను బుధవారం మధ్యాహ్నం ఎమ్మెల్యే కందుల ఆకస్మికంగా తనిఖీ చేశారు.
వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ పదేపదే ఇంటర్వ్యూలు ఇస్తూ నియోజకవర్గంలో ఏమి జరగటం లేదని అబద్ధాలు చెబుతున్నారని, జరిగిన, జరుగుతున్న పనులు కన్పించకపోతే కళ్లకు మంచి పవర్ ఉన్న అద్దాలు పెట్టుకోవాలని టీడీపీ ఇన్చార్జి ఎరిక్షన్‌బాబు ఎద్దేవా చేశారు.
కొండపి మండలంలోని ఓ విద్యుత్ అధికారి వసూల్ రాజా అవతారం ఎత్తాడు. పైసలిస్తేనే పనిచేస్తున్నాడు. వ్యవసాయ, పారిశ్రామిక కనెక్షన్లకు భారీ మొత్తంలో డిమాండ్ చేస్తున్నాడు. కొందరు డబ్బులు చెల్లించినా మరికొంత కావాలని పట్టుబడుతున్నాడు. దీంతో రైతులు, పారిశ్రామికవేత్తలు బెంబేలెత్తిపోతున్నారు.
నల్లమల అటవీ ప్రాంతంలో పులుల లెక్కింపు ప్రక్రియ మొదటి దశ ముగిసింది. దేశవ్యాప్తంగా నాలుగేళ్లకొకసారి నిర్వహించే జాతీయ పులుల గణన (ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్) ఈ నెల 1న ప్రారంభమై 8వ తేదీ వరకూ సాగింది.