జిల్లాలో స్క్రబ్ టైఫస్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. సంతనూతలపాడు మండలం రుద్రవరం గ్రామానికి చెందిన నాగేంద్రం (54) అనే మహిళ గుంటూరులోని జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు.
జిల్లా విద్యాశాఖాధికారిగా సీవీ రేణుక నియమితులయ్యారు. ఈమేరకు మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఆమె ప్రస్తుతం గుంటూరు డీఈవోగా ఉన్నారు. ఇప్పటి వరకూ ఇక్కడ పనిచేస్తున్న ఎ.కిరణ్‌కుమార్ గుంటూరు జిల్లా బోయపాలెం డైట్‌కు బదిలీ అయ్యారు.
దర్శి మునిసిపాలిటీ పరిధిలోని ప్రజలకు స్వచ్ఛమైన మంచినీరు అందించేందుకు అమృత్ పథకం అమలుకు అధికారులు శ్రీకారం చుట్టారు. ఎన్నో సంవత్సరాలుగా వాయిదా పడుతూ వచ్చి తాజాగా టెండర్లు పిలవడంతో లైన్‌క్లియర్ అయింది.
పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని గ్రామీణ రోడ్లకు మహర్దశ పట్టింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిరాదరణకు గురైన ఈ రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కేంద్ర పథకమైన స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ కేపిటల్ ఇన్వె్‌స్టమెంట్ (సాస్కి) నిధులను మంజూరు చేసింది.
రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు వెలిగొండ పర్యటన వాయిదా పడింది. ప్రాజెక్టు పనులను పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించేందుకు ఆయన జిల్లాకు వస్తున్నట్లు ఆ ప్రాజెక్టు అధికారులకు సోమవారం సమాచారం అందింది.
వాతావరణ పరిస్ధితులు అనుకూలించక, గిట్టబాటు ధరలు లేక కష్టాల్లో ఉన్న రైతు లను అడుగడుగున సమస్యలు వెంటాడుతు న్నాయి.
మార్కాపురం జిల్లాను అభివృద్ధి దిశగా నడిచేలా నాయకులు, అధికారులు కృషిచేయాలని మండల టీడీపీ అధ్యక్షుడు మోరబోయిన బాబురావు కోరారు.
బేస్తవారపేట మండలంలోని ంతలపాలెంలో ఒక వ్యక్తి కుటుంబ కలహాలతో మద్యం సేవిం ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది.
మార్కాపురం పట్టణంలో వందల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ నేతల అండతో అక్రమార్కులు చెలరేగిపోయారు. అప్పట్లో అధికారులు అటువైపు చూడాలంటే వణికిపోయారు. దీంతో ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా అనధికారికంగా అంతస్తుల మీద అంతస్తులు నిర్మించారు.
సాగర్ కాలువలకు నీటి పరిమా ణాన్ని ఎట్టకేలకు పెంచారు. జిల్లా సరిహద్దుకు చెప్పిన మాట ప్రకారం అధికారులు 2,600 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం సాగర్ కాలువలకు నీటి పరిమాణం పూర్తిగా తగ్గడంతో రైతులు పడుతున్న ఇబ్బందులను వివరిస్తూ ‘ఆంధ్రజ్యోతి’లో కథనాలు ప్రచురిత మయ్యాయి.