Home » Andhra Pradesh » Prakasam
చీరాల నియోజకవర్గ పరిధిలో ఉన్న సాగునీటి వనరుల అభివృద్ధికి చే యూతను ఇవ్వాలని నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మ ల రామానాయుడుకు ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య విజ్ఞప్తి చేశా రు. మంగళవారం మంత్రి చాంబర్లో ఆయనను ఎమ్మె ల్యే కొండయ్య కలిశారు.
నీటిపారుదల రంగంలో జిల్లాలోని రెండు కీలక ప్రాజెక్టులకు ఊరట కలిగేలా కేటాయింపులు జరిగాయి. వెలిగొండ, గుండ్లకమ్మ పనులు వేగంగా సాగేలా నిధులు దక్కాయి. మిగతా రంగాలకూ కేటాయింపులు ఆశాజనకంగానే ఉన్నాయి.
జిల్లాలో ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన పనులను నిర్దేశించిన లక్ష్యాల మేరకు పూర్తి చేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి సోమవారం సాయంత్రం జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణతో కలిసి ఆమె మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో అవినీతి వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. ఉద్యోగోన్నతుల్లోనూ అక్రమాలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తు తున్నాయి. ఇదేవిషయమై ఇద్దరు ఉద్యోగులు సోమవారం కలెక్టర్ తమీమ్ అన్సారియాను కలిసి ఫిర్యాదు చేశారు.
పోలీసు శాఖలో ఒకే రోజు ముగ్గురు వివిధ కారణాలతో మృతిచెందారు. వారిలో ఇరువురు హెడ్ కానిస్టేబుళ్లు హఠాన్మరణం చెందగా.. మరో కానిస్టేబుల్ కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఆశాఖలో విషాదం నెలకొంది.
కార్తీక సోమవారం పురస్కరించుకుని పట్టణంలోని జగదాంబ సమేత మార్కండేశ్వర స్వామి ఆలయంలో కార్తీక సోమవారం పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహిం చారు.
ప్రజాసమస్యల పరిష్కార వేదికగా ప్రజాదర్బార్ నిర్వహిస్తునట్లు టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ గూడూరి ఎరిక్షన్‌బాబు తెలిపారు.
దర్శి ప్రజల ఆహ్లాదం కోసం ఏర్పాటుచేసిన ఎన్టీఆర్ పల్లెవనం పార్క్ నిర్వాహణ అధ్వానంగా మారింది. సిబ్బందికి గత రెండు సంవత్సరాలుగా జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఆకతాయిలు పార్క్‌లోని ఆట వస్తువులు, పరికరాలను విరకొట్టారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో ఎన్టీఆర్ పల్లెవనం పార్క్ అభివృద్ధికి కేటాయించిన నిధులు దుర్వినియోగమయ్యాయి.
సాదా చీరలపై రంగు, రంగుల డిజైన్లు, ఆకర్షణీయమైన హ్యాండ్ వర్క్ చీరాల ప్రత్యేకత. మండలంలోని తోటవారిపాలేనికి చెందిన ఇరువురు దంపతులు సాదా చీరలపై చేతి కుంచెలతో వివిధ రంగుల డిజైన్లు వేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. మొదట రోజుకు ఒకటి, రెండు చీరలపై డిజైన్ చేసే వీరు ప్రస్తుతం రోజుకు సుమారు 15 నుంచి 20 చీరలు తయారు చేసే స్థాయికి ఎదిగారు.
అద్దంకి మార్కెట్ యార్డ్ ఆవరణలలో నిర్వహించే సంతలు ఇంకా గాడిన పడలేదు. దశాబ్ద కాలం కిందట తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అప్పటి అద్దంకి మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో వినూత్నంగా అన్నగారి సంత నిర్వహణ ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక గుర్తిం పు వచ్చింది. రైతులే స్వయంగా తమ ఉత్పత్తులను తెచ్చుకొని అమ్మకాలు చేసుకునేలా ఎన్టీఆర్ పేరుతో అన్నగారి సంతగా నామకరణం చేసి ప్రారంభించారు.