Home » Andhra Pradesh » Srikakulam
శ్రీకాకుళం ఆర్అండ్బీ డచ్ భవనం వద్ద ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాస్థాయి విభిన్న ప్రతిభా వంతుల క్రీడాపోటీలను బుధవారం డీఆర్వో ఎం.వెంకటేశ్వరరావు ప్రారంభించారు.
ఖరీఫ్ ధాన్యం కొనుగోలులో నాణ్యతాప్రమాణాలు పాటించాలని వ్యవసాయశాఖ జేడీ కె.త్రినాథస్వామి అన్నారు.
ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ ఎస్.రమణ అక్రమాలకు పాల్పడ్డా రంటూ గ్రామస్థులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు బుధవారం స్థానిక గ్రామ సచివాల యంలో ఉపాధి ఏపీడీ కె.లోకేష్ గ్రామసభ నిర్వహించి విచారణ చేప ట్టారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య తోపులాట ఏర్పడింది.
మండ లంలోని మునసబుపేటకు చెందిన వడ్డి రాజేశ్వరి ఇంట్లో 2021 అక్టోబరు పదో తేదీన జరిగిన దొంగతనం కేసులో నిందితులకు జైలు శిక్ష విధించినట్లు రూరల్ ఎస్ఐ కె.రాము బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
పీఎం సూర్యఘర్ నిర్దేశిత లక్ష్యా లను సకాలంలో అధిగమించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ కోరారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి జిల్లా, మండల స్థాయి అధికారులతో వివిధ శాఖలకు సంబంధించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
జిల్లాలో మెళియాపుట్టి కేంద్రంగా ఐటీడీఏ ఏర్పాటు చేయాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబ యోగి కోరారు. ఈ మేరకు మంగళవారం శ్రీకాకుళంలోని డే అండ్ నైట్ కూడలి వద్ద గల అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. అనంతరం ప్లకార్డులతో ప్రదర్శన ప్రదర్శన నిర్వ హించారు.
కల్లెపల్లి సముద్ర తీరంలో ఉన్న సంప్రదాయ గురుకులం అభివృ ద్ధికి సహకరించాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, గురుకులం డైరెక్టర్, నృత్య కళాకారిణి స్వాతి సోమనాథ్ కోరారు.
నైపుణ్యం పెంపొందించుకోవడంతో ఉజ్వల భవిత పొందవచ్చని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ కేఆర్ రజని తెలిపారు. వర్సిటీలో కామర్స్ అండ్ మేనే జ్మెంట్ విభాగం ఆధ్వర్యంలో పీటర్ పెర్డినాండ్ డ్రక్కర్ జయంతి పురస్కరించుకుని మంగళవారం మేనేజ్మెంట్ డే కార్యక్రమం నిర్వహించారు
ఒడిశా మద్యం ఆంధ్రా మీదుగా అక్రమ రవాణా జరగకుండా జాగ్రత్తతీసుకోవాలని, అక్రమ మద్యం అరికట్టాలని ప్రొహిబి షన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ డి.శ్రీకాంత్రెడ్డి కోరారు. మంగళవారం పురుషోత్తపురం చెక్పోస్ట్, ఇచ్ఛాపురం ఎక్సైజ్ కార్యాలయంలో రికార్డులను తనిఖీ చేశారు.
ఒడిశా రాష్ట్రం పర్లాకిమిడి నుంచి వస్తున్న మురుగునీరు పాతపట్నం వద్ద మహేంద్ర తనయ నదిలో కలుస్తుంది. దీంతో నదీ జలాలతో పాటు భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి.