Home » Andhra Pradesh » Visakhapatnam
స్థానిక ప్రాంతీయ ఆస్పత్రిలో గర్భిణి మృతిపై డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ జాయింట్ కమిషనర్ రమేశ్ కిషోర్ బుధవారం విచారణ చేపట్టారు. ఎస్.రాయవరం మండలం చినగుమ్మలూరుకి చెందిన కంటె దేవి పురుడు పోసుకోవడానికి సోమవారం మధ్యాహ్నం ప్రాంతీయ ఆస్పత్రిలో చేరి మంగళవారం ఉదయం ఆకస్మికంగా మృతి చెందిన విషయం తెలిసిందే.
మండలంలోని ఇరడాపల్లి పంచాయతీ దిగువ సంపాల గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో అనారోగ్యానికి గురైన గ్రామస్థుడిని బుధవారం డోలీలో తరలించాల్సిన దుస్థితి నెలకొంది.
మునిసిపాలిటీ పరిధి పెదబొడ్డేపల్లిలోని ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. గొలుగొండ పీహెచ్సీ హెల్త్ అసిస్టెంట్ ఇంట్లోకి దొంగలు చొరబడి నగదు, బంగారం అపహరించారు. బాధితుడు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి.
పట్టణంలోని వ్యాపార సంస్థలు ఈ నెల 26 నుంచి బంద్ చేస్తున్నట్టు అనకాపల్లి రైస్ మర్చంట్స్ అసోసియేషన్, ఆయిల్ మర్చంట్స్ అసోసియేషన్, కిరాణా మర్చంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు బుధవారం తెలిపారు.
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి) పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా మందుబాబుల ధోరణి మాత్రం మారడం లేదు.
విశాఖపట్నంలో ఐటీ రంగం అభివృద్ధికి వడివడిగా అడుగులు పడుతున్నాయి.
Andhrapradesh: కార్గిల్ యుద్ధంలో పాక్పై విజయం సాధించడానికి కారణం వాజ్పేయి అని మిజోరాం రాష్ట్ర గవర్నర్ కంభంపాటి హరిబాబు తెలిపారు. ఆయన హయాంలో నాలుగు మెట్రో నగరాల మధ్య... నాలుగు లైన్ల జాతీయ రహదారిని వేశారన్నారు. ఏపీలో ఇచ్ఛాపురం నుంచి తడ వరకు వేయి కిలో మీటర్ల రోడ్లు వేశారని దీనితో భూములు విలువ పెరిగిందని చెప్పారు.
దైవదర్శనం కోసం కారులో ఒడిశా బయలుదేరినవారు... శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం చిన్న కొజ్జిరియా కూడలి వద్ద ప్రమాదం బారినపడ్డారు. ఈ ప్రమాదంలో తల్లీ, కుమార్తె సహా ముగ్గురు మృతిచెందారు.
విశాఖపట్నం స్టీల్ ప్లాంటు యాజమాన్యం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
విశాఖ నగర పరిధిలో టౌన్షిప్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టిడ్కో) ఆధ్వర్యంలో చేపట్టిన ఇళ్ల నిర్మాణాలు వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అసంపూర్తిగా నిలిచిపోయాయి.