Home » Andhra Pradesh » Visakhapatnam
మండలంలోని కాకరపాడు అటవీ సెక్షన్ పరిధి కాకరపాడులో అక్రమంగా నిల్వ చేసిన సుమారు రూ.1.47 లక్షల విలువైన రోజ్‌వుడ్, టేకు, గన్నర దుంగలను అటవీ రేంజర్ బుధవారం స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
మండలంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన కటికి, తాటిగుడ జలపాతాలకు త్వరలో మంచిరోజులు రానున్నాయి. ఈ జలపాతానికి పర్యాటకులు సులువుగా వెళ్లేందుకు రహదారుల నిర్మాణానికి పర్యాటక శాఖ చర్యలు చేపట్టింది.
సహజసిద్ధ అందాలకు నెలవైన పాడేరు మండలంలోని వంజంగి మేఘాల కొండకు బుధవారం పర్యాటకులు పోటెత్తారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ తదితర రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో తరలివచ్చారు.
ఆంధ్ర కశ్మీర్ లంబసింగికి ఈ సీజన్లో పర్యాటకులు పోటెత్తుతుంటారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి కూడా అధిక సంఖ్యలో వస్తుంటారు. అయితే ఇక్కడ మరుగుదొడ్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మహిళల పరిస్థితి వర్ణనాతీతం.
నిర్మాణాలు పూర్తి చేసుకున్న పక్కా గృహాల లబ్ధిదారులకు సకాలంలో బిల్లులు చెల్లిస్తున్నామని జిల్లా హౌసింగ్‌శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ బి.బాబు తెలిపారు. బుధవారం చింతపల్లి మండలంలో పర్యటించిన ఆయన కొమ్మంగి పంచాయతీ కొలపరి గ్రామంలో లబ్ధిదారులు నిర్మించుకుంటున్న గృహాలను స్వయంగా పరిశీలించారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ హెచ్చరికలతో వరి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో వర్షాలు అనుకూలించడంతో జిల్లాలో వరి పంట ఆశాజనకంగా పడింది.
మండలంలో కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ బుధవారం విస్తృతంగా పర్యటించారు. ముందుగా హుకుంపేట మండలం అండిబ పంచాయతీ పీవీటీజీ గ్రామం నక్కగొయ్యిని సందర్శించారు.
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు చెందిన ఇద్దరికి ప్రభుత్వంలో కీలక పదవులు లభించాయి.
సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఇచ్చిన హామీ మేరకు నైపుణ్య గణన చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
డ్వాక్రా సంఘాలకు మంజూరైన రుణాలను వారికి తెలియకుండానే బ్యాంకు నుంచి డ్రా చేశారు. మరోవైపు ఇతర సంఘాలు తీసుకున్న రుణాలకు సంబంధించి వాయిదాల చెల్లింపునకు సభ్యుల నుంచి నెలనెలా వసూలు చేసిన సొమ్ములను బ్యాంకుకు జమ చేయకుండా స్వాహాచేశారు. దాదాపు రూ.40 లక్షల మింగేసిన వెలుగు వీవోఏ (విలేజ్ ఆర్గనైజింగ్ అసిస్టెంట్) వ్యవహారం స్థానికంగా కలకలం రేపింది. బాఽధిత మహిళలంతా వ్యవసాయ కూలీ కుటుంబాలకు చెందిన వారు కావడం, అక్షరజ్ఞానం లేనివారు కావడంతో వీవోఏ మోసగించినట్టు సమాచారం. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూడడంతో మండలంలోని సింహాద్రిపురం పంచాయతీకి చెందిన పలువురు మహిళలు మంగళవారం వీవోఏను పట్టుకుని నిలదీశారు. అనంతరం వెలుగు అధికారులను, పోలీసులను ఆశ్రయించారు. ఇందుకు సంబంధించి బాధిత డ్వాక్రా సభ్యులు చెప్పిన వివరాలిలా వున్నాయి.