Home » Andhra Pradesh » Visakhapatnam
ఆంధ్ర విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డి హయాంలో జరిగిన అక్రమాలపై వారం రోజుల్లో విచారణ కమిటీ వేస్తామని రాష్ట్ర మానవ వనరులు, ఐటీ శాఖా మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు.
పశువులను అక్రమంగా తరలిస్తున్న రెండు కంటైనర్ లారీలను శుక్రవారం మండలంలోని అడ్డరోడ్డు సమీపంలో పోలీసులు పట్టుకున్నారు. ఒకదానిలో 111 పశువులు ఉండగా వాటిల్లో 19 పశువులు చనిపోయాయి. మరో కంటైనర్లో 44 పశువులు ఉన్నాయి. దీనికి సంబంధించి ఎస్ఐ విభీషణరావు అందించిన వివరాలిలా ఉన్నాయి.
మండలంలోని పలు గ్రామాల్లో సిమెంట్ రహదారుల నిర్మాణం పనులు జోరుగా జరుగుతున్నాయి. 24 పంచాయతీల్లో 63 పనులకు అధికారులు ప్రతిపాదనలు పంపగా, ప్రభుత్వం రూ.4.06 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువల పనులు చేపట్టారు. డిసెంబరు నెలాఖరునాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించేలా స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీల నేతలు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ నూనెగింజల ఉత్పత్తిదారుల సహకార సంస్థ (ఏపీ ఆయిల్ ఫెడ్) పర్సన్ ఇన్చార్జిగా మాజీ ఎమ్మెల్యే, టీడీపీ పెందుర్తి నియోజకవర్గం ఇన్చార్జి గండి బాబ్జీ శుక్రవారం విజయవాడలో బాధ్యతలు స్వీకరించారు. విశాఖ ఎంపీ శ్రీభరత్, మాజీ ఎంపీపీ గండి దేముడు, టీడీపీ మండల ఉపాధ్యక్షుడు బర్ల రమణ, పలువురు కూటమి పార్టీలకు చెందిన పలువురు నాయకులు హాజరై ఆయనను అభినందించారు.
కాదేదీ స్వాహాకు అనర్హం అన్న చందంగా వుంది గత వైసీపీ పాలకులు, ఆ పార్టీ నాయకుల తీరు. సామాజిక బాధ్యత కింద గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం కార్పొరేట్ కంపెనీలు, పరిశ్రమల యాజమాన్యాలు ఇచ్చిన సీఎస్ఆర్ నిధులను సైతం వదల్లేదు. అభివృద్ధి పనుల పేరుతో నిధులు మంజూరు చేయించి, వైసీపీ నాయకులు, సర్పంచుల పేర్లతో నామినేషన్ విధానంపై పనులు చేపట్టినట్టు రికార్డుల్లో చూపి, పనులు చేయకుండానే నిధులు స్వాహా చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే బయటపడుతున్న ఈ అక్రమాలపై కూటమి ప్రభుత్వం విచారణ జరిపించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం నిర్వహణకు ప్రభుత్వం ఇస్తున్న డైట్ బిల్లులు, వేతనాలు చాలకపోవడంతో నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసర సరకుల ధరలు విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో ఒక్కో విద్యార్థికి ప్రభుత్వం ఇస్తున్న నిధులు, వాస్తవ ఖర్చులకు పొంతన వుండడంలేదు. దీంతో విద్యార్థులకు నాణ్యతతో రుచికరమైన భోజనం వండిపెట్టడం సాధ్యం కావడంలేదని వాపోతున్నారు. అంతేకాక భోజనం బిల్లులు, తమ వేతనాలు సకాలంలో ఇవ్వక పోవడంతో అప్పులు చేసి విద్యార్థులకు భోజనాలు పెడుతున్నామని చెబుతున్నారు.
ఉమ్మడి నిర్వహణలో ఉన్న బలిమెల జలాశయం నీటి వినియోగంపై ఆంధ్రా, ఒడిశా అధికారులు లెక్కలు తేల్చారు.
పాడేరులో శుక్రవారం జరిగిన వారపు సంతకు ఐదు అడుగుల పొడవైన 17 కిలోల బరువైన నాగలదుంపను గిరి రైతు తీసుకువచ్చాడు.
గిరిజన సహకార సంస్థ సంపూర్ణ అభివృద్ధికి సహకరించాలని గిరిజన సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి కె.కన్నబాబును జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్కుమార్ కోరారు.
వైసీపీ పాలనలో ఇబ్బంది పడని వర్గం ఏదీ లేదు. చివరకు కొవిడ్ సమయంలో గిరిజన యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చిన, కొవిడ్ కేర్ సెంటర్లో బాధితులకు భోజనాలు పెట్టిన స్వయం సహాయక సంఘాలకు కూడా జగన్ సర్కార్ ఝలక్ ఇచ్చినవైనం తాజాగా అసెంబ్లీలో ప్రస్తావనతో వెలుగుచూసింది.