రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శుక్రవారం నగరానికి రానున్నారు.
మండలంలోని అమీన్‌సాహెబ్ పేట వద్ద వున్న ప్రైవేటు సిమెంటు ఫ్యాక్టరీ యాజమాన్యం అన్ని రకాల నిబంధనలను తుంగలో తొక్కుతున్నదని స్థానికులతోపాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఫ్యాక్టరీ నుంచి వెలువడే కాలుష్యంతో వ్యవసాయ భూములు పాడైపోతున్నాయని, పంటలు దెబ్బతింటున్నాయని వాపోతున్నారు. మరోవైపు రెండు చెరువులకు సంబంధించి సుమారు ఎకరా భూమిని కబ్జా చేసి కంపెనీ అవసరాల కోసం రోడ్డు, వంతెన నిర్మించారు. వీటికి సంబంధించి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ స్థానికులు నాలుగు రోజుల నుంచి ఆందోళనలు చేస్తున్నారు.
అచ్యుతాపురం సెజ్ పరిధిలోని రాంబిల్లి మండలంలో ఏర్పాటు చేయతలపెట్టిన ఇంటిగ్రేటెడ్ సోలార్ ఇన్గాట్ అండ్ వేఫర్ (సోలార్ పలకల తయారీ) పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం 140 ఎకరాలు కేటాయించింది. ఈ మేరకు గురువారం సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గసమావేశం ఆమోదించింది.
ఏళ ్ల తరబడి అరకొర వేతనాలతో కాలం వెళ్లదీస్తున్న సహకార సంఘాల ఉద్యోగులు వేతనాల పెంపుతోపాటు, ఉద్యోగ భద్రత కల్పించాలన్న డిమాండ్లతో ఆందోళనబాట పట్టారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో అమలుకు నోచుకోని సహకార ఉద్యోగుల వేతనాల పెంపు (పీఆర్సీ).. కూటమి ప్రభుత్వం అయినా అమలు చేయాలని సహకార ఉద్యోగులు కోరుతున్నారు.
మండల కేంద్రానికి శివారున వున్న అల్లుపురంలో గ్రామాన్ని గురువారం కేజీహెచ్‌కు చెందిన ర్యాపిడ్ రెస్పాండ్ బృందం సందర్శించింది. స్క్రబ్ సైఫస్ లక్షణాలతో వృద్ధుడు మృతిచెందినట్టు పత్రికల్లో వార్తలు రావడంతో అధికారులు స్పందించించారు.
గిరిజన విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. గిరిజన ప్రాంతాల్లో ఐటీడీఏ ఆధ్వర్యంలో ఉన్న గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయులకు సంబంధించి గత మూడు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న భాషా పండితుల పదోన్నతులకు గురువారం కేబినెట్లో గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
ఇంటి పన్ను వసూలులో రాష్ట్రంలోని పంచాయతీల్లో అల్లూరి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) చంద్రశేఖర్ తెలిపారు.
మన్యంలో రోజు రోజుకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతుండడంతో చలి తీవ్రత క్రమంగా పెరుగుతున్నది. దీంతో మన్యం వాసులు గజగజ వణుకుతున్నారు.
జిల్లాలో 528 మినీ అంగన్వాడీ కార్యకర్తలను మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలుగా అప్‌గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో గురువారం ఆ ఉత్తర్వుల కాపీలను అంగన్వాడీ కార్యకర్తలకు కలెక్టర్ దినేశ్‌కుమార్ అందజేశారు.
విశాఖ రీజియన్‌లో ఆర్టీసీ ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) దాదాపు 95 శాతం నమోదవుతోంది. అందుకు తగ్గట్టుగా ఆదాయం వస్తోంది. ఇందుకు ‘స్ర్తీశక్తి’ పథకమే కారణమని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టు 15న స్ర్తీశక్తి పథకం ప్రారంభించింది. ఆ మరుసటిరోజు నుంచే ఓఆర్ పెరుగుతూ వచ్చింది.