Home » Andhra Pradesh » Vizianagaram
పార్వతీపురం నుంచి పాలకొండ వైపు వెళ్లే ప్రధాన రహదారి అత్యంత దారుణంగా తయారైంది. అడుగడుగునా భారీ గోతులు ఏర్పడడంతో పలువురు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాటిని పూడ్చారు. కాగా ప్రయాణికులు, వాహనదారులు అవస్థలను దృష్టిలో పెట్టుకుని ఈ రోడ్డు మరమ్మతులకు ఇటీవల ప్రభుత్వం రూ.10 లక్షలు మంజూరు చేసింది. అయితే ఈ మార్గంలో చిన్నపాటి గోతులను పూడ్చి, పెద్ద గోతులను వదిలి పెట్టడంతో పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
కల్తీ విత్తనాలు విక్రయించి.. రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయశాఖాధికారి రాబర్ట్‌పాల్ హెచ్చరించారు. మంగళవారం సాలూరు అగ్రిల్యాబ్‌లో రైతులు, విత్తన సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు.
జిల్లాలోని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీటి పరీక్షలు చేయాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో తాగునీరు, పారిశుధ్య కమిటీ సమావేశం నిర్వహించారు.
వాగులు గెడ్డలపై చెక్ డ్యామ్‌లు నిర్మించేందుకు వారం రోజుల్లో ప్రతిపాదనలు సమర్పించాలని ఇరిగేషన్ అధికారులను కలెక్టర్ అంబేడ్కర్ ఆదేశించారు. ఉపాధి హామీ మెటీరియల్ కాంపోనెంట్ నిధులతో వీటిని మంజూరు చేస్తామని చెప్పారు.
కార్తీకమాసం మూడో సోమవారం సందర్భంగా జిల్లాలో శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. అంతటా శివనామస్మరణ మార్మోగింది. వేకువజామునే పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు నేరుగా శైవ క్షేత్రాలు, గుహాలయాలకు చేరుకున్నారు.
తాటిపూడి రిజర్వాయర్‌లో బోటింగ్ నిర్వహణకు రాష్ట్రప్రభుత్వం అనుమతించింది. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కృషితో జలవనరుల శాఖ అనుమతులు జారీ చేసింది.
వైసీపీ ప్రభుత్వం గిరిజనులకు చెందిన 18 రకాల సంక్షేమ పథకాలను రద్దు చేసింది. 2014-2019 మధ్య తెలుగుదేశం ప్రభుత్వం అందించిన ఫీడర్ అంబులెన్స్‌లను నిర్వీర్యం చేసింది.
ఎంతో ప్రయాస పడి.. ఎన్నో ఇబ్బందులకు ఓర్చి.. నిరీక్షించి కలెక్టరేట్‌కు వచ్చి ఇచ్చే విన్నపాలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఒక సమస్యతో వచ్చిన వారే పదేపదే తిరిగి వస్తూ విన్నవించుకుంటున్నారు.
జిల్లాలో రైతులకు కూలీల సమస్య వెంటాడుతుంది. దీంతో ఆశించిన స్థాయిలో వ్యవసాయ పనులు సాగడం లేదు. జిల్లావ్యాప్తంగా ఒకేసారి వరి కోతలు మొదలైనప్పటికీ.. కూలీల కొరత నేపథ్యంలో అన్నదాతలకు ఖరీఫ్ ఖర్చులు తడిసిమోపెడవు తున్నాయి.
మండల స్థాయిలో ప్రతి సోమవారం పకడ్బందీగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు.