Home » Andhra Pradesh » Vizianagaram
తమ సమస్యలు పరిష్కరించాలని ఆశా వర్కర్లు, సీహెచ్డబ్య్లూలు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద పెద్దఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు.
మండల కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల కళాశాలకు చెందిన విద్యార్థినులు జోనల్ క్రీడా పోటీల్లో ప్రతిభ కనపర్చారు.
ఆటలు మానసిక వికాసానికి దోహదం చేస్తాయని జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ అధ్యక్షుడు డా.ఎం.శ్రీరాములు, కేంద్ర సాహి త్య అకాడమీ అవార్డు గ్రహీత ఎన్.ఉమామహేశ్వరరావు అన్నా రు.
కేంద్ర ప్రభుత్వం అవ లంభిస్తున్న రైతు, వ్యవసాయ, కార్మిక గిరిజన వ్యతిరేక విధానాలపై పోరాటం తప్పదని ఎస్కేఎం జిల్లా కన్వీనర్ బి.దాసు, ఏపీ రైతు సంఘం నాయకు డు బి.అప్పలనాయుడు అన్నారు.
సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న జెట్టీ నిర్మాణం రెండు మండలాల మత్స్యకారులకు కలగా మిగులుతోంది. జెట్టీ ఉంటే స్థానికంగా ఉపాధి దొరుకుతుందన్న మత్స్యకారుల ఆశ నెరవేరడం లేదు. ఆర్థిక కష్టాలకు తాళలేక చాలా మంది మత్స్యకారులు కుటుంబాల సమేతంగా వలసబాట పడుతున్నారు. గుజరాత్, మహారాష్ట్ర, పారాదీప్ ప్రాంతాలకు వెళ్లి అక్కడ చాలా కష్టాలు ఎదుర్కొంటున్నారు.
పత్తి రైతులు దళారుల వ్యూహానికి చిక్కి గిట్టుబాటు ధరకు నోచుకోవడం లేదు. రామభద్రపురం చుట్టుపక్కల ప్రాంతాల్లో వేలాది ఎకరాల్లో ఏటా పత్తిపంట సాగుచేస్తున్న రైతులకు చివరికి నష్టాలే మిగులుతున్నాయి. ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినా రైతులు పంటను అప్పగించే పరిస్థితి లేదు.
వారు క్షేత్రస్థాయిలో విద్యుత్ పరికరాల మరమ్మతులు చేపడుతుంటారు. ఎప్పటికప్పుడు ప్రజలకు ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం చూపుతుంటారు. నిరంతరం అందుబాటులో ఉంటారు. ఐదేళ్ల కిందట నియామకమైన వీరు ఎదుగూ బొదుగూ లేకుండా ఉండిపోయారు. వారే ఎనర్జీ అసిస్టెంట్లుగా పిలిచే గ్రేడ్-2 లైన్మన్లు. పెరిగిన పని ఒత్తిడితో రెండు శాఖల మధ్య నలిగిపోతున్నామని వాపోతున్నారు.
ధాన్యం సేకరణలో ఈసారి ప్రభుత్వం అన్నదాతలకు అనుకూలమైన మార్పులు చేసింది. పంటను తనకు నచ్చిన మిల్లుకు అందజేసే వెసులుబాటు కల్పించింది. ముందస్తుగా కొనుగోలు కేంద్రం కూడా ప్రారంభించింది. జిల్లా వ్యాప్తంగా 3.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
గిరిజన ఆశ్రమ పాఠశాలలపై వైసీపీ సర్కారు నిర్లక్ష్యం విద్యార్థులకు శాపంగా మారింది. వాటి నిర్వహణను గాలికొదిలేసిన గత ప్రభుత్వం.. మౌలిక వసతుల కల్పనకు మంగళం పాడేసింది. నిధుల కేటాయింపును మరిచింది. గిరిజన విద్యార్థుల సంక్షేమాన్ని విస్మరించింది.
జిల్లాలో తెలుగు తమ్ముళ్లతో పాటు జనసేన, బీజేపీ శ్రేణులు నామినేటెడ్ పదవుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం పలు కార్పొరేషన్లకు చైర్మన్లు, డైరెక్టర్లను నియమించింది. అయితే జిల్లాకు చెందిన వారికి ఎటువంటి పదవులు లభించలేదు. ఈ నేపథ్యంలో కూటమి సీనియర్ నాయకులు వ్యవసాయ మార్కెట్ కమిటీలపై దృష్టి సారించారు.