Home » Andhra Pradesh » Vizianagaram
ఓ కుమార్తె తన తల్లికి తలకొరివి పెట్టి రుణం తీర్చుకుంది.
ఎల్టీఆర్ కేసుల పై పార్వతీపురం సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ శనివారం విచారణ చేశారు.
విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి వారి ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ప్రోగ్రాం అధికారి టి.జగన్మోహన్రావు అన్నారు.
లక్కవరపుకోట మండల పరిధిలోని కళ్లేపల్లి, రేగ, నర్సంపేట, గంగుబూడి. శ్రీరాంపురం, తామరాపల్లి, కోనమసివానిపాలెం, నీలకంఠాపురం, లచ్చింపేట గ్రామాలకు సక్రమంగా వర్షాలు పడలేదు. చెరువుల గుంతలు, నేలబావుల నుంచి ఇంజన్ ఆయిల్‌తో నీరు తోడి వరి నాట్లు వేశారు.
తోటపల్లి ఎడమ ప్రధాన కాలువ ఆక్రమణలకు పాల్పడిన వారిపై చర్యలు చేపట్టాలని పాలకొండ సబ్ కలెక్టర్ యశ్వంత్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు.
కొత్తవలసలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయండి. పేద, మద్య తరగతి కుటుంబాలకు ఇదెంతో కీలకం. ఈ కళాశాల కోసం ఎప్పటి నుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అధికారంలో వున్న కూటమి ప్రభుత్వంలో విద్యాశాఖా మంత్రి నారా లోకేశ్ సహకారంతో పునాదిరాయి పడుతుందని ఆశపడుతున్నాం.
మండలంలోని వెంకటరాయుడుపేట గ్రామాన్ని కలెక్టర్ ఏ.శ్యామ్‌ప్రసాద్ శనివారం ఉదయం సందర్శించారు.
బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని సాగునీటి ప్రాజెక్టులు, వనరులకు సంబంధించిన ప్రధాన సమస్యలను ఎమ్మెల్యే బేబీనాయన శనివారం ప్రస్తావించారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తన అన్న సుజయ్‌కృష్ణరంగారావు మంత్రిగా ప్రాతినిధ్యం వహించినప్పుడు బొబ్బిలి నియోజకవర్గ పరిధిలో తెర్లాం మండలం లోచర్ల, బొబ్బిలి మండలం శివడవలస గ్రామాలకు తోటపల్లి ఎత్తిపోతల పథకాలను పెద్దమనసుతో మంజూరు చేశారని ప్రస్తావించారు.
- విజయనగరానికి చెందిన ఓ యువకుడు ఆ మధ్య రాజకీయ నాయకులను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. అది వైరల్ కావడంతో ఆ బాధిత నేత జిల్లా కేంద్రంలోని సైబర్ పోలీసును ఆశ్రయించాడు. రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన యువకునిపై లోతగా ఆరా తీసిన పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.
జిల్లాలో ఎంతోమంది రేషన్‌కార్డులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అన్ని అర్హతలున్నప్పటికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందలేకపోతున్నారు. ప్రధానంగా సామాజిక పింఛన్లను నోచుకోక నానా అవస్థలు పడుతున్నారు.