Home » Andhra Pradesh » Vizianagaram
రోజూలానే పనిలోకి వెళ్లిన ఆ కుటుంబ పెద్ద తిరిగి ఇంటికొస్తాడని అనుకున్నారు. కానీ విధి చిన్నచూపు చూసింది. పనిచేసిన చోటే ఆ ఇంటి పెద్ద దిక్కు ఊపిరి ఆగిపోయింది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోయారు.
జిల్లా సమస్యలపై అసెంబ్లీలో ఎమ్మెల్యేలు గళమెత్తారు. నిధులు కేటాయించి.. పరిష్కారం మార్గం చూపించాలని కోరారు.
జిల్లాలో అంగన్వాడీలు కదంతొక్కారు. తమ సమస్యలు పరిష్కరించాలని.. మినీ సెంటర్లను మొయిన్ సెంటర్లుగా మార్చాలని నినదిం చారు. శనివారం కలెక్టరేట్ ఎదుట బైఠాయించి పెద్దఎత్తున ధర్నా చేశారు.
వరుణుడు ముఖం చాటేయడంతో సాగునీటి కోసం రైతులు నానా అవస్థలు పడుతున్నారు. చివరి దశకు చేరుకున్న వరి పంటను కాపాడు కునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు.
పూర్తిస్థాయిలో తాగునీటి సరఫరాయే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ వి.రవీంద్ర తెలిపారు. శనివారం పార్వతీపురం మున్సిపాల్టీలో తాగునీరు, పారిశుధ్యం, పట్టణ ప్రణాళిక, రెవెన్యూ విభాగాల అఽధికారులతో సమీక్షిం చారు.
నిరుద్యోగులైన 15 నుంచి 59 సంవత్సరాల మధ్య గల స్ర్తీ, పురుషులకు, ప్రైవేటు రంగంలో పని చేస్తున్న వారికి అవరసమైన నైపుణాలను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం నైపుణ్య సర్వే నిర్వహిస్తోందని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు.
రాజీపేట గ్రామంలో ఉన్న శంబలనగరి ఆశ్రమంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం ఆకాశజ్యోతి వెలిగించారు.
ఉత్తరాంధ్రలో ఎంతో మందికి జీవనో పాధి కల్పిస్తున్న విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ యోచ నను తక్షణమే విరమించాలని వైవీఎస్ మహాదేవన్ డిమాండ్ చేశారు.
గత వైసీపీ ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతో ప్రభుత్వ విద్య నిర్వీర్యం అయ్యింది. వందల సంఖ్యలో పాఠశాలలను ఎత్తేసి పిల్లలకు చదువును దూరం చేసింది. ఫలితంగా జిల్లాలో డ్రాపౌట్స్ పెరిగిపోయారు. 6,259 మంది పిల్లలు బడికి వెళ్లడం లేదని సర్వేలో తేలింది.
అది బయటకు ఓ ఫంక్షన్ హాల్. కానీ, లోపల మాత్రం అంతా అడ్డగోలు వ్యవహారాలే. నిత్యం అక్కడికి కార్లు, ద్విచక్ర వాహనాల్లో బడాబాబులు వస్తుంటారు. గదులు అద్దెకు తీసుకుని గుడివాడ క్యాసినో తలపించేలా లక్షల రూపాయలు పెట్టి పేకాట శిబిరాలు నిర్వహిస్తుంటారు. లోపల వారికి రాచమర్యాదలు. మందు, విందుతో పాటు సకల సౌకర్యాలు ఉంటాయి.