Home » Andhra Pradesh » Vizianagaram
ఉత్తరాంధ్రలో ఎంతో మందికి జీవనో పాధి కల్పిస్తున్న విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ యోచ నను తక్షణమే విరమించాలని వైవీఎస్ మహాదేవన్ డిమాండ్ చేశారు.
గత వైసీపీ ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతో ప్రభుత్వ విద్య నిర్వీర్యం అయ్యింది. వందల సంఖ్యలో పాఠశాలలను ఎత్తేసి పిల్లలకు చదువును దూరం చేసింది. ఫలితంగా జిల్లాలో డ్రాపౌట్స్ పెరిగిపోయారు. 6,259 మంది పిల్లలు బడికి వెళ్లడం లేదని సర్వేలో తేలింది.
అది బయటకు ఓ ఫంక్షన్ హాల్. కానీ, లోపల మాత్రం అంతా అడ్డగోలు వ్యవహారాలే. నిత్యం అక్కడికి కార్లు, ద్విచక్ర వాహనాల్లో బడాబాబులు వస్తుంటారు. గదులు అద్దెకు తీసుకుని గుడివాడ క్యాసినో తలపించేలా లక్షల రూపాయలు పెట్టి పేకాట శిబిరాలు నిర్వహిస్తుంటారు. లోపల వారికి రాచమర్యాదలు. మందు, విందుతో పాటు సకల సౌకర్యాలు ఉంటాయి.
జిల్లాలో ఎక్కడైనా పేకాట శిబిరాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు. గురువారం రాత్రి నగరంలోని ఎస్వీఎన్ నగర్లోని సుజాత కన్వెన్షన్ హాల్లో పేకాట శిబిరంపై విజయనగరం డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించి 42 మందిని అరెస్టు చేశారు.
ఆదివాసీలు దేశం గర్వపడేలా ఎదగాలని కలెక్టర్ అంబేడ్కర్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో గిరిజన స్వాతంత్య్ర సమరయోధుడు భగవాన్ బిర్సాముండా జయంతిని ఘనంగా నిర్వహించారు.
గిరిజనుల సమస్యలను పరిష్కరించేందుకు కొత్తగా 47 ఫీడర్ అంబులెన్స్లను కేటాయించామని గిరిజనశాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు.
జిల్లా ప్రజలు శుక్రవారం కార్తీక పౌర్ణ మిని వైభవంగా జరుపుకొన్నారు. విజయనగరం, బొబ్బిలి, ఎస్.కోట, నెల్లిమర్ల, చీపురుపల్లి, రాజాం, గరివిడి, డెంకాడ, గజపతినగరం తదితర మండలాల్లో కార్తీక పౌర్ణమిని ఘనంగా నిర్వహించారు.
జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రారంభించాలని.. మిల్లర్లు బ్యాంకు గ్యారెంటీ ఇవ్వాలని.. ఈ నెల మొదటి వారంలోనే కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం మరోలా ఉంది. మిల్లర్ల నుంచి బ్యాంకు గ్యారెంటీలు రాకపోవడంతో ఇప్పటివరకు ‘మన్యం’లో ఒక్క కేంద్రం కూడా ప్రారంభం కాలేదు. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
జిల్లాలో ఇంటింటికీ జియోట్యాగింగ్ ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. ‘మన్యం’లో 3,03,111 గృహాలు ఉండగా, ఇప్పటివరకు 1,07,344 ఇళ్లకు జియోట్యాగింగ్ పూర్తయింది. మిగిలిన 1,95,767 ఇళ్లను మరో వారం రోజుల్లో పూర్తి చేసేందుకు ప్రణాళికలను రూపొందించారు.
గిరిజనుల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. విద్యతో పేదరికం, దోపిడీ వంటి వ్యవస్థల నుంచి బయటపడొచ్చని.. ప్రగతి బాటలో పయనించొచ్చని చెప్పారు. ఐక్యతతో హక్కులు కాపాడుకో వచ్చన్నారు. బిర్సా ముండా జయంతి సందర్భంగా శుక్రవారం పార్వతీపురం ఐడీడీఏ ఆవరణలో జన జాతీయ గౌరవ దివస్ను ఘనంగా నిర్వహించారు.