Home » Andhra Pradesh » West Godavari
తెల్లబంగారంగా పిలువబడే పత్తిసాగుకు ప్రస్తు తం కష్టకాలం ఎదురైంది.
బోధనేతర పనుల నుంచి ఉపాధ్యాయులకు విముక్తి కలిగించడానికి ప్రభుత్వాలు ఎంత మాత్రం పట్టించుకోవడం లేదని ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు ధ్వజమెత్తారు.
ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల్లో ఉన్నవారు వెళ్లిపోయారు. కొత్తవారు చేరలేదు. ఫలితంగా ముదినేపల్లిలోని షెడ్యూల్డు కులాల కళాశాల స్థాయి బాలురు, బాలికల వసతిగృహాలు మూతపడ్డాయి.
‘భావిపౌరులకు రాజ్యాంగాన్ని పరిచయం చేద్దాం’ అని విశ్రాంత ప్రిన్సిపాల్ సంకు మనోరమ అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని తరగతి గదుల్లో విద్యార్థులకు సులభంగా బోధించే పద్ధతిపై ఆదివారం ఎస్సీఐఎం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో తణుకులోని విద్యా సంస్థల అధ్యాపకులతో వర్క్ షాపు నిర్వహించారు.
ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే ధ్యేయమని, విద్యకు అధిక ప్రాధాన్యమిస్తామంటూ సూచించిన కూటమి ప్రభుత్వం పాఠశాలల నిర్వహణకు కావల్సిన నిధులును విడుదల చేసి చిత్తశుద్ధిని చాటింది.
సంక్షేమ పథకాలు చిట్టచివరి లబ్ధిదారుకు చేరే లక్ష్యంతో అందరూ పనిచేయాలని జిల్లా ఇన్ఛార్జ్, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కోరారు.
‘ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేందుకు, సమన్వయంతో సమష్టిగా ముందుకు సాగుదాం. సమస్యలు వుంటే వాటిని పరిష్కరించుకుందాం’ అని విద్యుత్ శాఖ, జిల్లా ఇన్చార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కూటమి నాయకులకు సూచించారు.
రహదారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చిందని, రోడ్ల అభివృద్ధితో మెరుగైన జీవన విధానం కలగజేసే లక్ష్యంతో ముందుకెళు తున్నామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, పశ్చిమ గోదావరి జిల్లా ఇన్చార్జి మంత్రి గొట్టిపాటి రవికు మార్ అన్నారు.
ఐదేళ్ల పాటు జిల్లాలో ఏ మూలకెళ్ళినా గుంతలో పడాల్సిందే. కొందరేమో తీవ్ర ప్రమాదాలకు గురై మరణం అంచు వరకు వెళ్లొచ్చినవారే. దాదాపు డజన్ల సంఖ్యలో క్షతగాత్రులు. గుంత పూడ్చండి సామీ అంటే అప్పటి పాలకులంతా అదేదో నేరమ న్నట్టుగా ఎగాదిగా చూసేవారు.
ఒకానొకప్పుడు ఉమ్మడి కుటుంబాలు వర్ధిల్లిన నాడు అప్పంటేనే ఆ కుటుంబాలన్నీ వణికిపోయేవి. ఆ పరిస్థితి రాకూడదని దేవుళ్ళకు మొక్కేవారు. ఉన్నదానిలోనే సరిపెట్టుకోవడమే తప్ప అప్పు జోలికి వెళ్ళేందుకే జంకు. అంతకంటే మించి అప్పు తీసుకుంటే ఆ కుటుంబానికి అప్రదిష్టే.