Home » Andhra Pradesh » West Godavari
కొత్త మద్యం విధానం అమలులోకి రావడం, ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో మద్యం షాపులకు లైసెన్సులు ఇవ్వడం జరిగి రెండు వారాలు గడి చాయో, లేదో అక్కడక్కడ చీకటిమాటున బెల్టు షాపుల్లో విక్రయాలకు తెరతీశారు.
ఎల్ఐసీ యాజమాన్యంతో ఏజెంట్ల సమస్యలపై చర్చలు జరిపి కొన్ని సమస్యలు పరిష్కరించినప్పటికీ మిగిలిన అన్ని సమస్యలు పరిష్కరించాలని ఎల్ఐసీ ఏజెంట్ల సంఘ నాయకులు డిమాండ్ చేశారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూట మి ప్రభుత్వం దీపావళికి ఉచిత గ్యాస్ అం దించనుంది. దీపం, ఉజ్వల, సీఎస్ఆర్ గ్యాస్ కనెకన్లతో పాటు అర్హత ఉన్న ప్రతి తెల్లకార్డు దారులకు ఉచిత గ్యాస్ అందించే విధంగా మార్గదర్శకాలు విడుదల చేయడంతో పాటు మంగళవారం గ్యాస్ బుకింగ్ ప్రారంభించారు.
బాణసంచాను అక్రమంగా నిల్వ చేసినా, విక్రయించినా కఠినచర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరికలు జారీచేశారు. జిల్లా అధికారులు దీనిపై ప్రకటన చేశారు. వ్యాపా రులకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. కాని, భీమవరం పట్టణంలో ఇవేమీ పనిచేయలేదు.
చింతలపూడికి చెందిన కోడూరి పరిమళ అనే గర్భిణికి ఈనెల 26న రాత్రి పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో మహిళను హుటాహుటిన పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి కుటుంబసభ్యులు తరలించారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు పట్టణాలకు ఆనుకుని వున్న 17 గ్రామాలను విలీనం చేశారు.
తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని ఓ గ్రామంలో 850 బియ్యం కార్డులు ఉన్నాయి.
షెడ్యూల్ ప్రాంతంలో ప్రత్యేక జీవో తీసుకువచ్చి ఉద్యోగ నియామకాలు చేపట్టాలని, ఆదివాసీ విద్యార్థులకు న్యాయం చేయాలని ఏజెన్సీ ప్రజా ప్రతినిధులు డిమాండ్ చేశారు.
రక్తదానం చేయడం ఆపదలో ఉన్న వారి ప్రాణం కాపాడడమేనని ఎస్పీ కేపీఎస్ కిశోర్ అన్నారు.
పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల యాజమాన్యాల పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాఽ ద్యాయులకు తీపికబురు.