Home » Andhra Pradesh » West Godavari
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఘట్టం తుది దశకు చేరుకుంది. గురువారం పోలింగ్ జరగనుంది.
విద్యార్థులు తల్లిదండ్రులు, ఉపాఽ ద్యాయుల మధ్య ఓ ఆత్మీయ వారఽథి నిర్మించా లన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ప్రభుత్వ స్కూళ్లల్లో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది.
తాడేపల్లిగూడెంలో మంజూరైన టీడీఆర్ బాండ్లపై విజిలెన్స్ పంజా విసిరింది. మునిసిపాలిటీలో తనిఖీలు నిర్వహించింది.
తుఫాన్ కారణంగా మూడు రోజులుగా రైతులకు కంటిపై కునుకు లేకుండా కురిసిన వర్షాలు మంగళవారం తగ్గుముఖం పట్టాయి. రైతులు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటికే జిల్లాలో సగానికి పైగా సార్వా మాసూళ్లు ముగిశాయి.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఎన్టీఆర్ అన్న క్యాంటీన్లో ఉదయం టిఫిన్, మఽ ద్యాహ్నం, రాత్రి భోజనాలు నాణ్యతగా అందించ డమే లక్ష్యమని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు.
మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని తెలుగుదేశం పార్టీలో చేరేముందు టీడీపీ కార్యకర్తలకు క్షమాపణ చెప్పాలనే డిమాండ్ వినిపిస్తోంది. కాగా మంగళవారం మధ్యాహ్నం ఉండవల్లిలోని సీఎం నివాసంలో చంద్రబాబుతో ఆళ్ల నాని భేటీ కానున్నారు. మరోవైపు ముఖ్య నేతలు ఉండవల్లి రావాల్సిందిగా టీడీపీ హైకమాండ్ నుంచి పిలుపు అందింది.
కాకినాడ నుంచి యథేచ్ఛగా రేషన్ బియ్యం విదేశాలకు తరలిపోతున్న వైనంపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. పౌరసరఫరాల శాఖ ద్వారా పిటిషన్ వేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. న్యాయపరమైన చిక్కులు అధిగమించేలా రాష్ట్ర ప్రభుత్వ అడిషనల్ అడ్వకేట్ జనరల్ రంగంలోకి దిగారు. కోర్టులో పిటిషన్ వేసిన తర్వాత సీజ్ ఆర్డర్ రావడానికి కేసు ఎలా ఉండాలనేదానిపై అధికారులతో సమాలోచనలు చేస్తున్నారు.
ఏలూరు జిల్లా, ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంపై డ్రోన్ కలకలం రేపింది. ఆలయ పరిసరాల్లో డ్రోన్లతో షూటింగ్లపై నిషేధం ఉన్నప్పటికీ ఓ యూట్యూబర్ డ్రోన్ ఎగురవేసి షూట్ చేసి విజువల్స్ను సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. ఆలయ అభివృద్ధి పనులు కూడా వీడియోలో రికార్డు అయ్యాయి. పట్టపగలు ఆలయ పరిసరాల్లో డ్రోన్తో షూట్ చేశాడు.
భవన నిర్మాణ సామగ్రి ధరలు కనిష్ఠ స్థాయికి చేరాయి.
ఒకప్పుడు వైసీపీలో కీలకంగా వ్యవహరించడమేకాదు వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా మెలిగి జగన్ ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలుగా రాణించినవారు ఇప్పుడు టీడీపీ వైపు చూస్తున్నారు.