Home » Devotional
ఓ బొజ్జ గణపయ్య నీ బంట్లు మేమయ్య ప్రశ్నపత్రం మాకు పంపావయ్యా మా ప్రశ్నపత్రం మాకు పంపావయ్యా మార్కులెన్నో వచ్చి మేలుగా పాసైతే కోర్కె తీరా నిన్ను కొలిచేమయ్యా మేళతాళాలు మారు మోగేటట్లు ఉత్సవాలెన్నెన్నో చేసేమయ్యా పోయినసారి మరీ పదమూడే వచ్చాయి
కార్తవీర్యుని వధించిన అనంతరం పరశురాముడు తన గురువు అయిన పరమశివుణ్ణి దర్శించుకోవాలని కైలాసం వెళ్ళాడు. ఆ సమయానికి శివపార్వతులు ఏకాంతంలో ఉన్నారు. బయట కాపలా కాస్తున్న గణపతి పరశురాముడిని ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి వీలుపడదని నివారించాడు.
శ్రీశంభుతనయునకు సిద్ధిగణనాథునకు వాసిగల దేవతావంద్యునకును ఆ సరస విద్యలకు ఆది గురువైనట్టి భూసురోత్తమ లోకపూజ్యునకును శ్రీశ్రీ జయ మంగళం నిత్య శుభమంగళం శ్రీశ్రీ నేరేడు మారేడు నెలవంక మామిడి దుర్వార చెంగల్వ ఉత్తరేణు వేరువేరుగదెచ్చి వేడ్కతో పూజింతు పర్వమున దేవగణపతికినిపుడు శ్రీశ్రీ జయ శ్రీశ్రీ
పిండితో చేసి ముద్దుల పిల్లవాని ప్రాణమును పోసి మురిసెను పార్వతమ్మ తండ్రిచే త్రుంచబడినట్టి తలకు బదులు దంతి శిరముంచబడెనంట ఎంత వింత తల్లిదండ్రుల ముద్దుల తనయుడతడు ప్రమధ గణముల గౌరవపాత్రుడతడు
విఘ్నేశ్వర జన్మ వృత్తాంతంపై పలు రకాల గాథలున్నాయి. వాటిని ఒక్కొక్క పురాణం ఒక విధంగా వర్ణించింది. వాటిలో వరాహపురాణం పేర్కొన్న విఘ్నేశ్వర జన్మ వృత్తాంతం తక్కిన పురాణ కథలకు భిన్నంగా ఉంది. ఈ పురాణం విఘ్నేశ్వరుడు ఆకాశం నుంచి జన్మించినట్టు చెప్పింది. రాక్షసుల బాఽధ ఎక్కువ కావడంతో ఆ బాధ నుంచి విముక్తి పొందే ఉపాయం చెప్పమని ఋషులు, దేవతలు శివుడిని అడిగారు.
శ్రీ మన్మహారాజ రాజేశ్వరీదేవి యంకంబులో స్తన్య పానంబుతో తన్మయత్వంబునన్ అంతులేనట్టి వాత్సల్య దుగ్ధాంబుధిన్ దేలియాడంగనిన్ జేరి యర్చించు భక్తావళిన్ సర్వవిఘ్న ప్రకాండంబులన్ రూపుమాయించి నానా వరంబుల్ ప్రసాదించి ఈరేడు లోకాల శోకాలు మాన్పించి రక్షించుచున్నట్టి యో విఘ్నరాజా భవత్పాద మందార మకరంద
పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు జ్ఞాతుల వలన సిరిసంప దలన్నీ పోగొట్టుకున్నాడు. భార్యతోను, తమ్ములతోనూ వనవాసం చేస్తూ ఒకనాడు నైమిశారణ్యానికి చేరుకున్నాడు. అక్కడ శౌనకాది ఋషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సూతమహామునిని దర్శించి, నమస్కరించి ‘‘అయ్యా! మేము రాజ్యాధికారము, సమస్త వస్తు వాహనములను పోగొట్టుకున్నాము.
మన దేవతలలో మొదట పూజించేది గణేశుడినే. మొదట మనం స్మరించేది కూడా ఆయన్నే. పూర్ణకుంభం లాంటి ఆ దేహం, బానవంటి ఆ కడుపు, పరిపూర్ణమైన ఈ జగత్తుకు గుర్తు. ఏనుగు తల, సన్నని కళ్ళు, సునిశిత పరిశీలనకు, మేథస్సుకు సంకేతాలు. ఆ వక్రతుండము, ఓంకార ప్రణవనాదానికి ప్రతీక.
(ఈ నామాలు చదువుతూ స్వామిని పూలతోగాని, అక్షతలతో గాని పూజించాలి. ఒకరు నామాలు చదువుతుండగా మిగిలిన వారు ఓం అనుకుంటూ పూజ చేయాలి.)
శుక్లాంబర ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం | ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే || అగజానన పద్మార్కం గజానన మహర్నిశం | అనేక దంతం భక్తానాం ఏకదంత ముపాస్మహే || ఖర్వం స్థూలతనుం గజేంద్రవదనం లంబోదరం సుందరం