Home » Devotional
నేడు (12-09-2024- గురువారం) న్యాయ, బోధన, రక్షణ, రవాణా రంగాల వారు శ్రమకు తగిన ఫలితం అందుకుంటారు. ఉద్యోగ, వ్యాపారాల్లో కొత్త వ్యూహాలను అమలు చేసి విజయం సాధిస్తారు...
నేడు (11-09-2024- బుధవారం) వృత్తి, వ్యాపారాల్లో లక్ష్య సాధనకు ఆటంకాలు ఎదురవుతాయి. వ్యవసాయం, పరిశ్రమలు, హోటల్, వైద్య రంగాల వారికి అంచనాలు ఫలించవపోచ్చు...
నేడు ( 10-09-2024 - మంగళవారం) ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి వృత్తి వ్యాపారాల్లో లక్ష్యాలు సాధిస్తారు. రక్షణ, న్యాయ, బోధన, కళా రంగాల వారికి ప్రోత్సాహకరమైన సమయం.
నేడు (09-09-2024- సోమవారం) వడ్డీ వ్యాపారులు, ట్రేడర్లు, బ్యాంకులు, ఆర్థిక సంస్థల వారికి కొంత ప్రోత్సాహకరంగా ఉంటుంది.
నేడు (08-09-2024- అదివారం) బంధుమిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. వ్యవసాయం, పరిశ్రమల రంగాల వారికి సకాలంలో చేతికి డబ్బు అందుతుంది.
దేశవిదేశాల్లో ఖ్యాతి గడించిన ఖైరతాబాద్ గణపతి ఈ ఏడాది సప్తముఖ మహాశక్తి గణపతిగా దర్శనం ఇవ్వనున్నాడు. ఖైరతాబాద్‌లో గణేశ్ ఉత్సవాలు ప్రారంభించి ఏడు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది 70 అడుగుల మూర్తిని శిల్పులు సిద్ధం చేశారు. సప్త ముఖాల్లో ఓవైపు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మరోవైపు సరస్వతి, లక్ష్మి, పార్వతుల మధ్య గణపతి ఉండేలా విగ్రహాన్ని సిద్ధం చేశారు.
ఓ బొజ్జ గణపయ్య నీ బంట్లు మేమయ్య ప్రశ్నపత్రం మాకు పంపావయ్యా మా ప్రశ్నపత్రం మాకు పంపావయ్యా మార్కులెన్నో వచ్చి మేలుగా పాసైతే కోర్కె తీరా నిన్ను కొలిచేమయ్యా మేళతాళాలు మారు మోగేటట్లు ఉత్సవాలెన్నెన్నో చేసేమయ్యా పోయినసారి మరీ పదమూడే వచ్చాయి
కార్తవీర్యుని వధించిన అనంతరం పరశురాముడు తన గురువు అయిన పరమశివుణ్ణి దర్శించుకోవాలని కైలాసం వెళ్ళాడు. ఆ సమయానికి శివపార్వతులు ఏకాంతంలో ఉన్నారు. బయట కాపలా కాస్తున్న గణపతి పరశురాముడిని ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి వీలుపడదని నివారించాడు.
శ్రీశంభుతనయునకు సిద్ధిగణనాథునకు వాసిగల దేవతావంద్యునకును ఆ సరస విద్యలకు ఆది గురువైనట్టి భూసురోత్తమ లోకపూజ్యునకును శ్రీశ్రీ జయ మంగళం నిత్య శుభమంగళం శ్రీశ్రీ నేరేడు మారేడు నెలవంక మామిడి దుర్వార చెంగల్వ ఉత్తరేణు వేరువేరుగదెచ్చి వేడ్కతో పూజింతు పర్వమున దేవగణపతికినిపుడు శ్రీశ్రీ జయ శ్రీశ్రీ
పిండితో చేసి ముద్దుల పిల్లవాని ప్రాణమును పోసి మురిసెను పార్వతమ్మ తండ్రిచే త్రుంచబడినట్టి తలకు బదులు దంతి శిరముంచబడెనంట ఎంత వింత తల్లిదండ్రుల ముద్దుల తనయుడతడు ప్రమధ గణముల గౌరవపాత్రుడతడు