Share News

ఏకదంతుడు ఎలా అయ్యాడు?

ABN , Publish Date - Sep 07 , 2024 | 10:55 AM

కార్తవీర్యుని వధించిన అనంతరం పరశురాముడు తన గురువు అయిన పరమశివుణ్ణి దర్శించుకోవాలని కైలాసం వెళ్ళాడు. ఆ సమయానికి శివపార్వతులు ఏకాంతంలో ఉన్నారు. బయట కాపలా కాస్తున్న గణపతి పరశురాముడిని ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి వీలుపడదని నివారించాడు.

ఏకదంతుడు ఎలా అయ్యాడు?

కార్తవీర్యుని వధించిన అనంతరం పరశురాముడు తన గురువు అయిన పరమశివుణ్ణి దర్శించుకోవాలని కైలాసం వెళ్ళాడు. ఆ సమయానికి శివపార్వతులు ఏకాంతంలో ఉన్నారు. బయట కాపలా కాస్తున్న గణపతి పరశురాముడిని ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి వీలుపడదని నివారించాడు. ‘‘పరమేశ్వరుడిని దర్శించుకోకుండా అడ్డగించడానికి నీవెవ్వడివి’’ అంటూ పరశురాముడు ధిక్కరించాడు. మాటా మాటా పెరిగి అది కాస్తా యుద్ధానికి దారి తీసింది. గణపతి తన తొండంతో పరశురాముణ్ణి పైకి ఎత్తి పడవేశాడు. పరశురామునికి కళ్ళు బైర్లుకమ్మాయి.


ఆగ్రహించిన పరశురాముడు తన చేతిలోని గండ్రగొడ్డలిని గణపతిపై ప్రయోగించడంతో ఒక దంతం ఊడిపడింది. ఆ చప్పుడుకు ఉలిక్కిపడిన పార్వతీ పరమేశ్వరులు శయన మందిరం నుంచి బయటికి వచ్చారు. నెత్తురోడుతున్న బాల గణపతిని ఎత్తుకొని పార్వతి పరశురాముడిని మందలించింది. తన వల్ల జరిగిన అపరాధాన్ని మన్నింపమని పరశురాముడు వేడుకున్నాడు. అంతటితో ఆ కథ సమాప్తమైనా గణపతి మాత్రం ఒక దంతం పోగొట్టుకొని ‘ఏకదంతుడి’గా పేరు పొందాడు.

Updated Date - Sep 07 , 2024 | 10:55 AM