Home » National
అదానీపై అమెరికాలో లంచం కేసు నమోదైన నేపథ్యంలో భారత క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ సైతం ఈ విషయంపై సూత్రప్రాయంగా దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం.
లంచాలు, మోసం అభియోగాలు ఎదుర్కొంటున్న అదానీ గ్రూపు అధినేత గౌతమ్ అదానీని అప్పగించాలని అమెరికా కోరుతుందా? ఆయన అరెస్టు తప్పదా?
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడనున్నాయి. 288 స్థానాలున్న శాసన సభకు ఈ నెల 20న ఒకే విడతలో పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఫలితాల్లో ఏ కూటమి మెజారిటీ దక్కించుకున్నా కేవలం 72 గంటల్లోనే సర్కారును
అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ విజేత జెన్నీ ఎర్పెన్‌బెక్, అమెరికన్ లిటరరీ హిస్టారియన్ స్టీఫెన్ గ్రీన్బ్లాట్, ఇటాలియన్ అమెరికన్ రచయిత ఆండ్రే అసిమన్, రాయబ్ బయోగ్రాఫర్ టినా బ్రౌన్ సహా 300 మంది వక్తలు ఈ ఉత్సవంలో పాల్గొంటారని జైపూర్ లిటరేషన్ ఫెస్టివల్ (జేఎల్ఎఫ్) నిర్వాహకులు ప్రకటించారు.
మహారాష్ట్రలో రాజకీయ పరిస్థితిని పరిశీలించి తగిన చర్యలు తీసుకునే బాధ్యతను సీనియర్ నేతలు అశోక్ గెహ్లాట్, భూపేష్ బఘెల్, డాక్టర్.జి.పరమేశ్వరకు అప్పగించినట్టు ఏఐసీసీ ప్రతినిధి కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. జార్ఖాండ్ పరిశీలకులుగా తారిఖ్ అన్వర్, మల్లు భట్టి విక్రమార్క, కృష్ణ అల్లవరును నియమించారు.
మరికొద్ది రోజుల్లో పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయని, వాయు కాలుష్య సంక్షోభంపై సమగ్రంగా చర్చించాల్సిన బాధ్యత ఎంపీలపై ఉందని రాహుల్ అన్నారు. దేశం ఎదుర్కొంటున్న ఈ సంక్షోభానికి శాశ్వత పరిష్కారం కనుగొనాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు ముందు రోజు ఈ క్యాష్-ఫర్-ఓట్స్ వివాదం చెలరేగింది. పాల్ఘర్ జిల్లాలో బీజేపీ సీనియర్ నేత వినోద్ తావ్డే డబ్బులు పంచారంటూ బహుజన్ వికాష్ ఆఘాడి (బీవీఏ) నేత హితేంద్ర ఠాకూర్ ఆరోపించారు. తావ్డే-బీవీఏ నేతలు-కార్యకర్తల మధ్య చోటుచేసుకున్న వివాదానికి సంబంధించిన వీడియో కూడా బయటకు రావడంతో సంచలనమైంది.
ట్రక్కులు, ఢిల్లీ వెలుపల రిజిస్టర్ అయిన వాయినాల ప్రవేశం నిలిపివేతపై చర్యలు సంతృప్తిగా లేవని, ఎన్ని ఎంట్రీ పాయింట్లు ఉన్నాయి, ఎన్ని టీమ్‌లు పనిచేస్తున్నాయనే దానిపై ఢిల్లీ ప్రభుత్వం ఇంతకుముందు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని ధర్మాసనం పేర్కొంది. వాహనాల ఆంక్షలకు సంబంధించిన క్లాజ్ 1, క్లాజ్ 2 అమలులో ఢిల్లీ ప్రభుత్వం, పోలీసులు విఫలమయ్యారని ఆక్షేపణ తెలిపింది.
ఘటన జరిగిన వెంటనే ఆ ప్రాంతాన్ని కోస్ట్‌గార్డులు తమ అధీనంలోకి తీసుకుని నౌకల మార్గాలను మళ్లించారు. జాడ గల్లంతైన వారి ఆచూకీ కోసం అదనపు సామగ్రని రప్పించారు. రెస్క్యూ ఆపరేషన్ కోసం ఆరు నౌకలు, నిఘా విమానాలు రంగంలోకి దింపినట్టు అధికారులు తెలిపారు.
రైల్వే బోగీల్లో సీసీ టీవీలు అమర్చేందుకు వేలాది కోట్ల రూపాయిల టెండర్లకు భారతీయ రైల్వే ఆహ్వానించిందంటూ వార్త కథనాల్లో ప్రచురితమవుతుంది. దీనిపై భారతీయ రైల్వేతోపాటు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో స్పందించింది.