Home » Politics
వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) మేనిఫెస్టో-2024ను (YSRCP Manifesto) రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేనిఫెస్టోను కాస్త నిశితంగా పరిశీలిస్తే.. ఇదేంట్రా బాబోయ్ అని తప్పకుండా మీకూ అనిపిస్తుంది. ఇంతకీ జగన్ రిలీజ్ చేసిన 2024 మేనిఫెస్టోకు.. 2019 మేనిఫెస్టోకు ఉన్న తేడాలేంటి..? అని బేరీజు చేసే పనిలో జనాలు, వైసీపీ కార్యకర్తలు నిమగ్నమయ్యారు..
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకుగాను (AP Elections) నామినేషన్ల పర్వం ముగియడంతో.. గెలుపోటములను నిర్ణయించే మేనిఫెస్టో రిలీజ్ చేసే పనిలో అధికార, ప్రతిపక్ష పార్టీలు నిమగ్నమయ్యాయి. అదిగో మేనిఫెస్టో.. ఇదిగో మేనిఫెస్టో (YSRCP Manifesto) అంటూ కొద్దిరోజులుగా హడావుడి చేసిన వైసీపీ (YSR Congress) ఎట్టకేలకు శనివారం (ఏప్రిల్-27న) రిలీజ్ చేసింది.
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్పై (CM YS Jagan) ఈనెల 13వ తేదీన జరిగిన గులకరాయి దాడికి సంబంధించి పోలీసులు కొత్త సమాచారాన్ని రాబట్టారా? పోలీసు కస్టడీలో ప్రధాన నిందితుడు వేముల సతీష్ కుమార్ ఏ విషయాలు వెల్లడించాడు? అనే అంశాలు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారాయి. సతీష్ కుమార్ను రెండు రోజుల క్రితం..
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు (AP Elections) దగ్గరపడుతున్న కొద్దీ చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. ఒకరిపై ఒకరు నోరు పారేసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. నేతలు, అభ్యర్థుల మధ్య ఇలాంటి మామూలే అనుకుంటే.. వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (CM YS Jagan Mohan Reddy) నామినేషన్కు చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. దీంతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు (Nara Chandrababu) ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ దిమ్మదిరిగేలా కౌంటర్ ఇచ్చారు..
అక్కాచెల్లెమ్మలకు సంక్షేమం పేరిట అందింది అంతంతే.. కానీ, పన్నులు, చార్జీలు, కరెంటు బిల్లులు, పెంచిన మద్యం ధరల రూపంలో వారి నుంచి తిరిగి లాక్కుంది ఎంతెంతో! ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి లాంటి కీలక పదవులు ఇవ్వడమే వారి సాధికారత పట్ల తమకు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని వైసీపీ నేతలు గొప్పలు చెప్పుకొంటున్నారు. అలాగే క్షేత్రస్థాయిలో 50 శాతం పదవుల్లో వారిని నియమించామని సీఎం జగన్ ప్రతి సభలో అంటుంటారు. కానీ, హోంమంత్రిగా కనీసం ఒక్క డీఎస్పీని అయినా స్వయంగా బదిలీ చేసుకునే అధికారం వారికి ఉందా? పదవులు వీరికి.. పెత్తనం వారికి అన్నట్టు వ్యవహారాలు నడిపిస్తున్నారు.
ఎన్నికల ముందు వైసీపీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి ఏదో అనుకుంటే.. ఇంకేదో జరిగిపోతోంది.. దీంతో హైకమాండ్ దిక్కుతోచని స్థితిలో పడింది..
గ్రామ వలంటీర్లు రాజీనామాలు చేసి ఎన్నికల్లో వైసీపీ కోసం పని చేయాలని ఇన్నాళ్లు ఒత్తిడి చేసిన అధికార పార్టీ నేతలు రూటు మార్చారు. ఎన్ని ఒత్తిళ్లు, ప్రలోభాలకు గురి చేసినా.. ఆశించిన స్థాయిలో వలంటీర్లు స్పందించకపోవడంతో... వలంటీర్లుగా పని చేస్తే ఇబ్బందులు తప్పవని,
న్యూఢిల్లీ, ఏప్రిల్ 23(ఆంధ్రజ్యోతి): ఇండియా కూటమి అధికారంలోకి రాగానే అదానీ కుంభకోణంపై విచారణకు సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ఎంపీ జైరాం రమేశ్ అన్నారు
గ్రేటర్ పరిధిలో నాలుగు లోక్సభ స్థానాలుండగా.. అందులో రెండు సీట్లలో ప్రధాన పార్టీల నుంచి ఇద్దరు మహిళలు పోటీ చేస్తున్నారు.
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ‘మేమంతా సిద్ధం’ పేరుతో సీఎం జగన్మోహన్రెడ్డి గత ఇరవై రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం జగన్ నగరంలో వేపగుంట జంక్షన్ నుంచి పీఎం పాలెం వరకూ రోడ్షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన..