Home » Prathyekam
క్వీన్ ఎలిజబెత్ II, ప్రిన్స్ ఫిలిప్ 1947లో జరిగిన తమ వివాహ వేడుకలో ఓ భారీ కేక్‌ను కట్ చేశారు. ఆ కేక్ ముక్కను 77 సంవత్సరాల తర్వాత తాజాగా వేలం వేస్తే అనూహ్య స్పందన లభించింది. ఈ కేక్ ముక్కకు ``వేరీ రేర్ స్లైస్`` అని పేరు పెట్టారు. అయితే ఈ కేక్ ముక్క మాత్రం తినదగినది కాదు.
అమెరికాలోని టెక్సస్ నివాసి అలిస్సా ఓగ్లేట్రీ అనే రొమ్ము పాల దానంలో తన రికార్డును తానే బ్రేక్ చేసింది. ఏకంగా 2,645.58 లీటర్ల రొమ్ము పాలు దానం చేసిన వ్యక్తిగా ఆమె గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది.
పిచ్చుక గూళ్లలా కనిపిస్తున్నాయి కానీ ఒక కళాకారుడు చేసిన గూళ్లు ఇవి. చెట్ల కొమ్మలు, ఊడలు, వేర్లతో రూపొందించిన ఈ కళాఖండాల సృష్టికర్త నార్త్ కరోలినాకు చెందిన పాట్రిక్ డౌగర్టీ. వీటిలో కొన్ని గూళ్లు 40 అడుగుల ఎత్తువి ఉండటం విశేషం.
పాములు, ముంగిసల మధ్య హోరాహోరీ పోరు జరుగుతుంది. అయితే ముంగిసలు పాములతోనే కాదు ఇతర జంతువులతో కూడా ధైర్యంగానే తలపడతాయి. తాజాగా ముడు కుక్కలను ఓ ముంగిస భయపెట్టింది. పొలంలో జరిగిన ఆ యాక్షన్ ఎపిసోడ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బుర్రకు పదును పెట్టడం, తమ ప్రతిభను అందరి ముందు ప్రదర్శించేందుకు రీల్స్ చేయడం తప్పు కాదు. అయితే కొందరు ఈ రీల్స్ పిచ్చిలో పడి ఏం చేస్తున్నారో చూస్తుంటే ఆందోళన చెందడం ఖాయం. తాజాగా ఓ అమ్మాయి పెట్రోల్ బంక్ దగ్గర ప్రాణాలతో చెలగాటం ఆడింది.
మనముందు పంచభక్ష్యపరమాన్నాలున్నా సరే.. నూడుల్స్ కనిపించగానే నోరూరుతుంది. ఉప్పు, కారం, మసాలా, సాస్ దట్టించిన నూడుల్స్ అంటే పిల్లలు ఎగిరిగంతేస్తారు. అందులోనూ అప్పటికప్పుడు క్షణాల్లో తయారయ్యే తిండి ఏదన్నా ఉందా అంటే అది నూడుల్సే!. ముఖ్యంగా బడి పిల్లలకు ఇదే ప్రధాన ఆహారం అయ్యిందిప్పుడు.
నూతన వధూవరులు ప్రస్తుతం పెళ్లికి ముందే ప్రీ-వెడ్డింగ్ ఫొటోషూట్ పేరుతో సన్నిహితంగా ఫొటోలు దిగుతున్నారు. ఎన్నో థీమ్స్, స్టైల్స్‌తో నూతన వధూవరులను ఫొటోలు తీసేందుకు ఫొటోగ్రాఫర్లు తమ క్రియేటివిటీకి పదును పెడుతున్నారు. ఆ క్రమంలో కొన్ని ఫన్నీ ఘటనలు కూడా జరుగుతున్నాయి.
సత్తువుంది... మేధస్సుంది... అయినా ఆటను మధ్యలోనే ఆపారు. అది కూడా ‘కౌన్‌బనేగా కరోడ్‌పతి’ (కేబీసీ) గేమ్‌లో మూడున్నర లక్షల రూపాయలు గెలుచుకున్నాక... హెల్ప్లైన్లు ఉన్నప్పటికీ అనూహ్యంగా ‘క్విట్’ అయ్యారు. ఆయన నిర్ణయానికి ‘బిగ్‌బీ’ అమితాబ్ ఆశ్చర్యపోయారు... ఆనక అభినందించారు. ఆ కంటెస్టెంట్ పేరు డాక్టర్ నీరజ్ సక్సేనా. ఎవరీయన? ఏమా కథ...
బీహార్, జార్ఖండ్ ప్రజలకు ఛత్ అతిపెద్ద పండుగ సమయం. ఈ నాలుగు రోజుల పండుగలో సూర్య భగవానుడు, ఛతీమయ్యను పూజిస్తారు. రాముడు, సీత అయోధ్య నుంచి తిరిగి వచ్చి పట్టాభిషేకం జరిగిన తర్వాత సీతా దేవి ఉపవాస దీక్ష చేసి, సూర్యుణ్ని పూజించిన రోజుగా భావిస్తారు.
బార్టెండర్ ఉద్యోగానికి జెండర్‌తో పని లేదని నిరూపించి, తన వెరైటీ విన్యాసాలను ఎప్పటికప్పుడు యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశారు కవితా మేదర్. చీరకట్టులో ఆ ‘రికార్డు’ వీడియోలు జనాన్ని బాగా ఆకట్టుకున్నాయి. ఇటీవలే యూట్యూబ్ నుంచి ‘సిల్వర్ బటన్’ను సాధించిన ఏకైక మహిళా బార్టెండర్ విశేషాలే ఇవి...