Home » ACB
ఏసీబీ అధికారాల సమాచారం ప్రకారం, ఆప్ ప్రభుత్వ హయాంలో 12,748 తరగతి గదులు, అసోసియేటెడ్ బిల్డింగ్‌ల నిర్మాణాలకు సంబంధించి రూ.2,000 కోట్ల మేర అక్రమాలు జరిగాయి. సిసోడియా, జైన్‌లను విచారించేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గత మార్చిలో ఆమోదం తెలిపారు.
రిమాండ్‌లో ఉన్న ఈఎన్‌సీ హరీరామ్‌ను కస్టడీలోకి తీసుకొని విచారించాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు.
ఓ కేసులో ఇద్దరు అనుమానితుల నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లు తిరిగి ఇవ్వడానికి లంచం తీసుకున్న శామీర్‌పేట ఎస్సై పరశురామ్‌నాయక్ ఏసీబీకి చిక్కాడు.
ఏసీబీ అధికారులు హరీ రామ్‌ను అరెస్ట్ చేసి రీమాండ్‌కు తరలించారు. కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీగా ఆయన వ్యవహారించారు. హరీ రామ్‌ను అధికారులు కస్టడీలోకి తీసుకొని విచారించాలని భావిస్తున్నారు. ఈ మేరకు సోమవారం కోర్టులో కస్టడీ పిటీషన్ దాఖలు చేయనున్నారు. కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు.
ఆదాయానికి మంచిన ఆస్తుల కేసులో ఈఎన్‌సీ హరి రామ్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఆయనకు సంబంధించిన 14 చోట్ల అధికారులు సోదాలు చేశారు. భారీగా అక్రమాస్తులు బయటపడ్డాయి. సోదాలు ముగిసిన అనంతరం ఆదివారం తెల్లవారుజామున జడ్జి ముందు హాజరు పర్చగా విచారణ జరిపి న్యాయమూర్తి హరిరామ్‌కు 14 రోజుల రిమాండ్ విధించారు.
ACB Raids: హైదరాబాద్‌లో ఏకకాలంలో ఏసీ అధికారులు సోదాలు చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలక పాత్ర షోషించిన మాజీ ఈఎన్సీ హరీరామ్ నివాసంలో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి.
మహబూబాబాద్ జిల్లా ఇన్‌చార్జ్ రవాణాశాఖ అధికారి(డీటీవో)గా పని చేస్తూ.. గతంలో సస్పెండైన మహ్మద్ గౌస్‌పాషా నివాసంతో పాటు ఆయన బంధువులు, కుటుంబసభ్యుల ఇళ్లలో శుక్రవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు.
మాజీ మంత్రి విడదల రజని మరిదిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకుని ఏపీకి తరలిస్తున్నారు. స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి.. వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపనలు ఉన్నాయి. దీనిపై ఏసీబీ కేసు నమోదు చేసింది.
రాష్ట్రంలోని నాలుగు వేర్వేరు ప్రాంతాల్లో లంచం కోసం కక్కుర్తి పడ్డ ఐదుగురు అధికారులు ఏసీబీ వలలో చిక్కారు. భద్రాది-కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం గుట్టమల్లారంలో కొందరు ప్రభుత్వభూమిని కబ్జాచేసి ప్లాట్లుగా విభజించి విక్రయిస్తున్నారు.
తుంగతుర్తిలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో రిజిస్టర్‌లో ఉన్న 51 మంది విద్యార్థుల్లో 25 మంది మాత్రమే హాస్టల్‌లో ఉన్నట్లు ఏసీబీ తనిఖీల్లో వెల్లడి. హాస్టల్ పరిస్థితులు దయనీయంగా ఉండటంతో విద్యార్థులు అక్కడ ఉండటం లేదు అని అధికారులు వెల్లడించారు.