Home » America
ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమెరికా పర్యటన ప్రతి భారతీయుడి ఆత్మను కదిలించిందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్లో పవన్ కళ్యాణ్ స్పందించి ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు. ‘
అమెరికా పర్యటనను విజయవంతంగా ముగించుకుని ఇండియాకు తిరిగి వస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సీఎం నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘మోదీ లాంటి రాజనీతి గలవారి నాయకత్వంలో పనిచేయడం మా అదృష్ట’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
మూడు రోజుల అమెరికా పర్యటన తర్వాత ప్రధాని మోదీ ఢిల్లీకి బయలుదేరారు. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితిలో జరిగిన క్వాడ్ లీడర్స్ సమ్మిట్, సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్ (SOTF)లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. దీంతో పాటు ఆయన తన పర్యటనలో కీలక నేతలను కూడా కలిశారు.
న్యూఢిల్లీ: 4 వేల పురాతన వస్తువులను అమెరికా.. భారత్‌కు ఇచ్చేయడానికి సిద్ధమైంది. భారత్ నుంచి అక్రమంగా తరలించిన అత్యంత విలువైన పురాతన వస్తువులను తిరిగిచ్చేందుకు అమెరికా నిర్ణయం తీసుకుంది. భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఆ దేశం ఈ నిర్ణయం తీసుకుంది.
మూడు రోజుల యూఎస్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ వివిధ సభల్లో పాల్గొంటున్నారు. అందులో భాగంగా న్యూయార్క్‌లో భారతీయ అమెరికన్ సమాజంతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
న్యూయార్క్‌లో భారతీయ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు భారతదేశం వెనుకబడి లేదని, కొత్త వ్యవస్థలను తయారు చేసి నడిపిస్తుందని అన్నారు. దీంతోపాటు భారతదేశం కోసం తన జీవితాన్ని అంకితం చేస్తానని వ్యాఖ్యానించారు.
‘‘క్వాడ్ కూటమి ఏ దేశానికీ వ్యతిరేకం కాదు. అన్ని దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవిస్తాం. భద్రత, అభివృద్ధి చెందుతున్న సాంకేతికత, వాతావరణ మార్పులు, సామర్థ్య నిర్మాణమే మా లక్ష్యం.
అగ్రరాజ్యం అమెరికాలో క్వాడ్ సమ్మిట్ థీమ్ ఈసారి క్యాన్సర్ మూన్‌షాట్‌పై నిర్వహించారు. ఈ క్రమంలో క్యాన్సర్‌పై పోరాటానికి ప్రపంచ నేతలంతా మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన భారత ప్రధాని మోదీ గర్భాశయ క్యాన్సర్ విషయంలో కీలక ప్రకటనలు చేశారు.
రెండేళ్లుగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించాల్సిన అవసరం ఉందని, దీనికి భారత్ చొరవ చూపాలని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కోరారు. మోదీ-బైడెన్ మధ్య శనివారం జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా.. ఇరువురు నేతలు పలు అంశాలపై మాట్లాడారు.
చట్టబద్ధ శాశ్వత నివాస హోదాను సూచించే గ్రీన్ కార్డు చెల్లుబాటు కాలాన్ని పొడిగిస్తూ అమెరికా నిర్ణయం తీసుకుంది. గతంలో ఉన్న 24 నెలల కాలాన్ని 36 నెలలకు పెంచింది.