Narendra Modi: యూఎస్‌లో మరో రెండు భారతీయ రాయబార కార్యాలయాలు ఏర్పాటు
ABN , Publish Date - Sep 23 , 2024 | 09:04 AM
మూడు రోజుల యూఎస్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ వివిధ సభల్లో పాల్గొంటున్నారు. అందులో భాగంగా న్యూయార్క్‌లో భారతీయ అమెరికన్ సమాజంతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
నూయార్క్, సెప్టెంబర్ 23: అమెరికాలోని బోస్టన్, లాస్ ఏంజెల్స్ నగరాల్లో భారతీయ రాయబార కార్యాలయాలను ( ఇండియన్ కాన్సులేట్స్) ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. న్యూయార్క్‌లోని నాస్సు వెటరన్స్ కొలిసియమ్‌లో భారతీయ అమెరికన్ల సమావేశంలో మాట్లాడుతూ ప్రధాని మోదీ ఈ ప్రకటన చేశారు. ఈ రెండు నగరాల్లో రాయబార కార్యాలయాలు ఏర్పాటు చేయాలని చాలా కాలంగా డిమాండ్ ఉందన్న విషయాన్ని ఈ సందర్బంగా ఆయన గుర్తు చేశారు.
గతేడాది సిటెల్స్‌లో రాయబార కార్యాలయం ఏర్పాటు చేస్తామని ప్రకటించామని తెలిపారు. నేడు ఆ కార్యాలయం పని చేస్తుందన్నారు. అదే సమయంలో ఈ రెండు నగరాల్లో సైతం రాయబార కార్యాలయాలను ఏర్పాటు చేయాలంటూ మీరు.. తనకు సూచించిన విషయాన్ని ఈ సందర్భంగా మోదీ గుర్తు చేసుకున్నారు. ఈ ప్రకటన చేయడం తనకు సంతోషాన్ని కలిగించిందని ఆయన పేర్కొన్నారు.
లాస్ ఏంజెల్స్ మాజీ మేయర్, భారత్‌లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి సమక్షంలో ప్రధాని మోదీ ఈ ప్రకటన చేశారు. ఇక ప్రకటనను లాస్ ఏంజెల్స్ లోని భారతీయ అమెరిక సమాజం స్వాగతించింది. ఈ సందర్భంగా భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్, యూఎస్‌లోని భారత మాజీ రాయబారి తరణ్‌జిత్ సందులకు భారతీయ సమాజం కృతజ్జతలు తెలిపింది.
బోస్టన్, లాస్ ఏంజెల్స్‌లో రాయబార కార్యాలయాలు ఎందుకంటే..?
అమెరికాలోని బోస్టన్ నగరం.. విద్యా, ఫార్మా రంగానికి రాజధానిగా ఉంది. అలాగే లాస్ ఏంజెల్స్‌లో హాలీవుడ్ పరిశ్రమ ఉంది. అంతేకాకుండా వచ్చే ఏడాది ఈ లాస్ ఏంజెల్స్ నగరం వేదికగా ఒలింపిక్స్ క్రీడలు నిర్వహించనున్నారు. అలాగే అమెరికాలో అత్యంత పెద్ద నగరాల జాబితాలో లాస్ ఏంజెల్స్ రెండో స్థానంలో ఉంది. ఈ మహా నగరంలో రెండు నౌకాశ్రయాలున్నాయి. అలాగే ఈ నగరానికి అత్యంత పొడవైన తీర ప్రాంతముంది. దీంతో ఆ దేశానికి సంబంధించి 40 శాతం సముద్ర వాణిజ్యం దీని ద్వారానే జరుగుతుంది.
అమెరికాలో న్యూయార్క్ నగరంలో భారత శాశ్వత రాయబార కార్యాలయం పని చేస్తుంది. దీనితోపాటు యూఎస్‌లోని వివిధ నగరాల్లో.. అట్లాంట, చికాగో, హ్యూస్టన్, శాన్‌ఫ్రాన్సికో, సీటెల్‌లలో భారత రాయబార కార్యాలయాలు పని చేస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజుల పర్యటనలో భాగంగా యూఎస్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన పర్యటన నేటితో అంటే.. సెప్టెంబర్ 23వ తేదీతో ముగియనుంది.
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News