Home » Anantapur
జిల్లాలోని అన్ని చెరువులను నీటితో నింపి, రైతులను ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ డిమాండ్ చేశారు. సాగు, తాగు నీరు, రైతు సమస్యల పరిష్కారం కోసం శనివారం రాప్తాడు బస్టాండు వద్ద సీపీఎం ఆధ్వర్యంలో బస్సు జాతా నిర్వహిం చారు.
ఆరోగ్యశ్రీ పథకం అమలవు తున్నా డబ్బులు చెల్లించాల్సిందేనని అనంతపురంలోని కిమ్స్ సవేరా ఆస్పత్రి యాజమాన్యం బాధితులను డిమాండ్ చేస్తోందిని ఎమ్మెల్యే పరిటాల సునీతకు ఫిర్యాదులు వచ్చాయి. మండలంలోని గంగంపల్లికి ఎమ్మెల్యే శనివారం వెళ్లినప్పుడు... ఆ గ్రామానికి చెందిన బాధితుడు శ్రీకాంత తల్లి గోవిందమ్మ అనే మహిళ తన గోడు వెళ్లబోసుకున్నారు.
గ్రామాల్లో ఏ పనులు చేయాలో నిర్ణయించాల్సింది ఆ గ్రామస్థులే అని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నా రు. మండలంలోని గంగంపల్లి తండాలో శనివారం పల్లెపండుగ కార్యక్ర మంలో ఆమె పాల్గొని సీసీరోడ్లకు భూమిపూజచేశారు. నసనకోట పంచా యతీ గంగంపల్లి ఎీస్సీకాలనీలో ఎనఆర్జీఎస్ నిధులు రూ.20లక్షలు, జడ్పీ నిధులు రూ.48లక్షలతో సీసీరోడ్లకు భూమిపూజ చేశారు.
శారదా నగర్లోని శివబాలయోగి ఆశ్రమంలో నిర్వహిస్తున్న దసరా ఉత్సవాలు శుక్రవారం ముగిశాయి. ఈ సందర్భంగా భక్తులు నదీజలాలను కలశాలతో ఊరేగింపుగా తీసుకొచ్చి, ఆలయ ఆవరణలో కలశపూజలు నిర్వహించారు.
ప్రభుత్వ ఖజానాకు గండికొట్టా లని చూస్తే సహించేది లేదని విజిలెన్స ఎస్పీ వైటీపీటీఏ ప్రసాద్ హెచ్చ రించారు. ఆయన శుక్రవారం విజిలెన్స కార్యాలయంలోని తమ చాంబర్లో కార్యాలయ సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు.
కార్మికులకు అన్యాయం చేస్తున్న అవినీతి ఎంహెచఓ విష్ణుమూర్తిని వెంటనే సస్పెండ్ చేయాలని లేని పక్షంలో బదిలీ చేసి పంపాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్రకుమార్ డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికుల సమస్యలపై శుక్రవారం మున్సిపల్ యూనియన జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఏటీఎం నాగరాజు, నాగభూషణం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఆందోళన చేపట్టారు.
సాగు, తాగు నీటి ప్రాజెక్ట్లపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, వాటి ఆధునీకరణ చేపట్టాలని సీపీఎం సీనియర్ నాయకులు ఓబులు, జిల్లా కార్యదర్శి రాంభూపాల్ విమర్శిం చారు. తుంగభద్ర ప్రాజెక్టులో నీరు పొంగిపోర్లుతున్న సుబ్బరాయసాగర్ నింపలేని దౌర్భాగ్యస్థితిలో పాలకులు, అధికారులు ఉన్నారని పేర్కొన్నారు. జిల్లాలో సాగు, తాగునీటి సమస్యపై సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన బస్సు యాత్ర శుక్రవారం మండలపరిధిలోని నడిందొడ్డి, కేసేపల్లి మీదుగా మం డల కేంద్రమైన నార్పలకు చేరింది.
మండలంలో గురువా రం పల్లె పండుగ వర్షంలోనూ కొనసాగింది. టీడీపీ మండల నాయకు లు, అధికారులు కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలంలోని సోములదొ డ్డి, పాపంపేట, ఆకుతోటపల్లి గ్రామాల్లో నిర్వహించారు. ఈసందర్భంగా ఆయా గ్రామాల్లో సీసీరోడ్ల నిర్మాణాలకు భూమి పూజ చేశారు.
లోకకల్యాణం కోసం శా రదానగర్లోని శివబాల యోగి ఆశ్రమంలో గురు వారం వల్లి, దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కల్యాణోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించా రు. ఈ సందర్భంగా ఉత్సవ మూర్తులతో ఆలయ ప్రాకా రోత్సవం నిర్వహించారు. అనంతరం వల్లి, దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించా రు.
మండలంలోని ఒంటికొండ గ్రామంలో ప్రధాన రహదారపైపై వర్షపు నీరు నిలిచి మడుగును తలపిస్తోంది. వర్షం కురిసినప్పుడల్లా నీరు నిలుస్తుం డటంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో ప్రధాన రోడ్డుపై పెద్దఎత్తున నీరు నిలిచింది.