EDUCATION: విద్యార్థి జీవితంలో పది కీలకం : డీఈఓ
ABN , Publish Date - Nov 22 , 2024 | 12:27 AM
విద్యార్థులకు పదో తరగతి కీలకమని, విద్యార్థులు పరీక్షల్లో ప్రతిభ చూపి మంచి ఫలితాలు సాధించాలని డీఈఓ ప్రసాద్‌బాబు పేర్కొన్నారు. నగరంలోని నేతాజీ మున్సిపల్ స్కూల్‌లో ఆర్‌జేయూపీ జిల్లా ప్రధానకార్యదర్శి, తెలుగు స్కూల్ అసిస్టెంట్ రామాంజి నేయులు ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థుల కోసం రూపొందించిన తెలుగు మెటీరియల్‌ను డీఈఓ ప్రసాద్ బాబు, ప్రధానోపాధ్యాయులు ప్రకాష్‌రావు చేతుల మీదుగా గురువారం విద్యార్థులకు అందజేశారు.
అనంతపురం విద్య, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి) : విద్యార్థులకు పదో తరగతి కీలకమని, విద్యార్థులు పరీక్షల్లో ప్రతిభ చూపి మంచి ఫలితాలు సాధించాలని డీఈఓ ప్రసాద్‌బాబు పేర్కొన్నారు. నగరంలోని నేతాజీ మున్సిపల్ స్కూల్‌లో ఆర్‌జేయూపీ జిల్లా ప్రధానకార్యదర్శి, తెలుగు స్కూల్ అసిస్టెంట్ రామాంజి నేయులు ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థుల కోసం రూపొందించిన తెలుగు మెటీరియల్‌ను డీఈఓ ప్రసాద్ బాబు, ప్రధానోపాధ్యాయులు ప్రకాష్‌రావు చేతుల మీదుగా గురువారం విద్యార్థులకు అందజేశారు. ఆర్‌జేయూపీ జిల్లా ప్రధాన కార్యదర్శి, తెలుగు స్కూల్ అసిస్టెంట్ దేవరకొండ రామాంజినేయులను డీఈఓ అభినందించారు. కార్యక్రమంలో టీచర్లు లక్ష్మి, సుజాత, సుభాషిణి, రాధా తదితరులు పాల్గొన్నారు.
రామగిరి: పదిలో వందశాతం ఉత్తీర్ణత సాధించేలా ప్రతి ఉపాధ్యాయుడు శ్రద్ధ చూపాలని డీఈఓ పేర్కొన్నారు. ఆయన గురువారం సాయం త్రం మండలంలోని నసనకోట, కుంటిమద్ది ఉన్నత పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, పదో తరగతి విద్యార్థులతో సమావేశమై పలు సూచనలు చేశారు. ఆయన వెంట ఎంఈఓ శ్రీనివాసులు ఉన్నారు.
ల
మరిన్ని అనంతపురం వార్తల కోసం....