Home » Andhrajyothi
పాపాయికి చకచకా స్నానం చేయించాలన్నా, సబ్బుతో బట్టలు మెరిపించాలన్నా, టూత్‌బ్రష్‌ని పరిశుభ్రంగా మార్చాలన్నా ఇకపై క్షణాల్లో పనే. వంటింట్లోనే కాదు... బాత్రూమ్లో కూడా ‘స్మార్ట్’గా పనిచేసే గ్యాడ్జెట్స్ ఉన్నాయి. వాటిలో కొన్ని...
ఇంతకు ముందు అపార్ట్మెంట్ అంటే పది పన్నెండు ఫ్లాట్స్‌తో ఉండేవి. నగరాలు పెరుగుతున్న కొద్ది అపార్ట్మెంట్ల విస్తీర్ణం, ఎత్తు పెరిగాయి. 100 నుంచి 500 కుటుంబాల దాకా నివాసం ఉండే భారీ అపార్ట్మెంట్లు వెలుస్తున్నాయి. అయితే రష్యాలోని ఒక అపార్ట్మెంట్లో మాత్రం ఏకంగా 18 వేల మంది నివసిస్తున్నారంటే ఆశ్చర్యపోక తప్పదు.
లోకం చుట్టిరావాలనే కోరిక అందరికీ ఉంటుంది. కానీ సగటు మనిషి జీవితకాలంలో ప్రపంచంలో ఉన్న 195 దేశాల్లో రెండు మూడు దేశాలకు వెళ్లడమే మహాగొప్ప. అభిరుచి, ఆసక్తి ఉన్నవారైతే పదో, ఇరవయ్యో దేశాలు చుట్టి మురిసిపోతారు. సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు కూడా మహా అయితే పాతికో, యాభై దేశాలో పర్యటిస్తారు.
ఏ కూల్‌డ్రింక్స్ షాపులోనైనా, కిరాణ దుకాణంలోనైనా ఫ్రిజ్ నిండా రకరకాల కూల్‌డ్రింక్స్ కనిపిస్తాయి. వేసవిలో అయితే గిరాకీ మొత్తం వీటిదే. సాఫ్ట్వేర్ రంగంలో సంక్షోభం అనుకోండి... మారుతున్న యువతరం అభిరుచి అనుకోండి... ఇటీవల ట్రెండ్ మారుతోంది. ఫ్రిజ్‌ల్లో సరికొత్తగా ‘ఐస్ కప్స్’ వచ్చి చేరుతున్నాయి.
పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటకు వెళ్లిన ఎవరైనా గంధర్వ మహల్ చూడకుండా వెనక్కి రాలేరు. నాలుగు అంతస్థులు, పాతిక గదులతో రాజసం ఉట్టిపడే ఆ భవనం నిర్మించి ఈ ఏడాదితో వందేళ్లు అవుతోంది. ఇప్పటికీ చెక్కు చెదరని చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచిన గంధర్వమహల్.. ఓ అద్భుత సౌందర్య సౌధం...
వరుసగా మూడు సినిమాల సక్సెస్‌తో తిరిగి ఫామ్‌లోకి వచ్చిన బాలీవుడ్ బాద్షా షారుక్‌ఖాన్(Shah Rukh Khan) పన్ను చెల్లింపులో టాప్‌లో నిలిచి వార్తల్లోకి ఎక్కాడు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి షారుక్ ఏకంగా రూ. 92 కోట్ల పన్ను కట్టి నెంబర్‌వన్ టాక్స్ పేయర్‌గా నిలిచినట్లు ఫార్చ్యూన్ ఇండియా తెలిపింది.
ఆమె పాట పాడితే కోట్లలో వ్యూస్... లక్షల్లో రీల్స్. ఏ భాషలో అయినా, ఏ పాట అయినా క్షణాల్లో వైరలవ్వాల్సిందే. బాలీవుడ్ ‘జవాన్’లోని ‘చలేయా’, ‘జైలర్’లో ‘వా.. నువ్వు కావాలయ్యా’ (తమిళ్ వెర్షన్), ‘గుంటూరు కారం’లో ‘ఓ మై బేబీ’ పాటలు చాలు... ఆమె టాలెంట్‌ను అంచనా వేయడానికి.
ఓ బొజ్జ గణపయ్య నీ బంట్లు మేమయ్య ప్రశ్నపత్రం మాకు పంపావయ్యా మా ప్రశ్నపత్రం మాకు పంపావయ్యా మార్కులెన్నో వచ్చి మేలుగా పాసైతే కోర్కె తీరా నిన్ను కొలిచేమయ్యా మేళతాళాలు మారు మోగేటట్లు ఉత్సవాలెన్నెన్నో చేసేమయ్యా పోయినసారి మరీ పదమూడే వచ్చాయి
కార్తవీర్యుని వధించిన అనంతరం పరశురాముడు తన గురువు అయిన పరమశివుణ్ణి దర్శించుకోవాలని కైలాసం వెళ్ళాడు. ఆ సమయానికి శివపార్వతులు ఏకాంతంలో ఉన్నారు. బయట కాపలా కాస్తున్న గణపతి పరశురాముడిని ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి వీలుపడదని నివారించాడు.
పిండితో చేసి ముద్దుల పిల్లవాని ప్రాణమును పోసి మురిసెను పార్వతమ్మ తండ్రిచే త్రుంచబడినట్టి తలకు బదులు దంతి శిరముంచబడెనంట ఎంత వింత తల్లిదండ్రుల ముద్దుల తనయుడతడు ప్రమధ గణముల గౌరవపాత్రుడతడు