Home » AP Election Survey
ఏపీ అసెంబ్లీలో మొత్తం 175 స్థానాలు ఉండగా టీడీపీ+జనసేన కూటమి 104 సీట్లు గెలుచుకోనుందని ‘పయనీర్ పోల్’ సర్వే అంచనా వేసింది. అధికార వైసీపీ ప్రతిపక్ష పాత్ర పోషించడం తప్పదని, వచ్చే ఎన్నికల్లో 47 నియోజకవర్గాల్లో మాత్రమే గెలవనుందని లెక్కగట్టింది. అయితే 24 నియోజకవర్గాల్లో నువ్వు-నేనా అన్నట్టుగా టీడీపీ+జనసేన, అధికార వైసీపీ పార్టీల మధ్య టఫ్ ఫైట్ నడవనుందని విశ్లేషించింది. ఇక ఎంపీ స్థానాల విషయానికి వస్తే రాష్ట్రంలో మొత్తం 28 స్థానాలు ఉండగా టీడీపీ+జనసేన అత్యధికంగా 18 సీట్లు, వైసీపీ -7 సీట్లు దక్కించుకోనుందని ‘పయనీర్ పోల్’ సర్వే అంచనా వేసింది.
Minister Ambati Rambabu Ticket Issue: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు (AP Elections 2024) దగ్గరపడుతున్న కొద్దీ వైసీపీలో (YSR Congress) నేతలను ‘టికెట్’ భయం ఇంకా వీడలేదు. చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలకే కాదు పలువురు సీనియర్ నేతలు, మంత్రులకు కూడా గుబులు పట్టుకుంది. ఇప్పటికే సుమారు 60 నియోజకవర్గాలకు పైగా అభ్యర్థులను ప్రకటించిన జగన్.. ఇప్పుడు ‘సిద్ధం’ పేరిట (Siddam) భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ ఎన్నికల ప్రచారం చేసేస్తున్నారు. ఇక్కడి వరకూ అంతా బాగానే ఉంది కానీ.. తాజాగా అందుతున్న సమాచారం మేరకు జగన్ కేబినెట్‌లో కీలక శాఖకు మంత్రిగా వ్యవహరిస్తున్న అంబటి రాంబాబుకు (Ambati Rambabu) ఈ ఎన్నికల్లో సత్తెనపల్లి టికెట్ (Sattenapalli) ఇవ్వట్లేదని తెలిసింది...
Pioneer Poll Strategies Survey: వై నాట్ 175 (Why Not 175).. ఏపీలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో గెలవాల్సిందే..! ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాల్సిందే..! ఎన్ని పార్టీలు కలిసొచ్చినా సరే.. వైసీపీ ఒంటరిగానే బరిలోకి దిగుతుంది.. గెలిచి తీరుతాం..! ఇవీ వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ రెడ్డి ఎప్పుడు చూసినా.. ఏ సభలో ప్రసంగించినా మొదట వచ్చే మాటలు. సభలకు జనాలు వస్తున్నారు.. జగన్ కూడా బటన్ మీద బటన్‌లు నొక్కేస్తున్నారు.. అంతేకాదు.. ఏలూరు సిద్ధం సభావేదికగా ఎన్నిసార్లు బటన్ నొక్కారని లెక్కలతో సహా కూడా చెప్పారు జగన్. అయితే.. గ్రౌండ్ లెవల్‌లో మాత్రం సీన్ మొత్తం రివర్స్‌గా ఉంది...