AP Elections 2024: మంత్రి అంబటికి టికెట్ లేనట్టే.. తమ్ముడి కోసం చక్రం తిప్పుతున్న ఎమ్మెల్యే..!?
ABN , Publish Date - Feb 18 , 2024 | 10:42 PM
Minister Ambati Rambabu Ticket Issue: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు (AP Elections 2024) దగ్గరపడుతున్న కొద్దీ వైసీపీలో (YSR Congress) నేతలను ‘టికెట్’ భయం ఇంకా వీడలేదు. చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలకే కాదు పలువురు సీనియర్ నేతలు, మంత్రులకు కూడా గుబులు పట్టుకుంది. ఇప్పటికే సుమారు 60 నియోజకవర్గాలకు పైగా అభ్యర్థులను ప్రకటించిన జగన్.. ఇప్పుడు ‘సిద్ధం’ పేరిట (Siddam) భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ ఎన్నికల ప్రచారం చేసేస్తున్నారు. ఇక్కడి వరకూ అంతా బాగానే ఉంది కానీ.. తాజాగా అందుతున్న సమాచారం మేరకు జగన్ కేబినెట్‌లో కీలక శాఖకు మంత్రిగా వ్యవహరిస్తున్న అంబటి రాంబాబుకు (Ambati Rambabu) ఈ ఎన్నికల్లో సత్తెనపల్లి టికెట్ (Sattenapalli) ఇవ్వట్లేదని తెలిసింది...
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు (AP Elections 2024) దగ్గరపడుతున్న కొద్దీ వైసీపీలో (YSR Congress) నేతలను ‘టికెట్’ భయం ఇంకా వీడలేదు. చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలకే కాదు పలువురు సీనియర్ నేతలు, మంత్రులకు కూడా గుబులు పట్టుకుంది. ఇప్పటికే సుమారు 60 నియోజకవర్గాలకు పైగా అభ్యర్థులను ప్రకటించిన జగన్.. ఇప్పుడు ‘సిద్ధం’ పేరిట (Siddam) భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ ఎన్నికల ప్రచారం చేసేస్తున్నారు. ఇక్కడి వరకూ అంతా బాగానే ఉంది కానీ.. తాజాగా అందుతున్న సమాచారం మేరకు జగన్ కేబినెట్‌లో కీలక శాఖకు మంత్రిగా వ్యవహరిస్తున్న అంబటి రాంబాబుకు (Ambati Rambabu) ఈ ఎన్నికల్లో సత్తెనపల్లి టికెట్ (Sattenapalli) ఇవ్వట్లేదని తెలిసింది. ఈయనతో పాటు మరో ముగ్గురు మంత్రులకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వట్లేదని సమాచారం. పల్నాడు జిల్లాకు చెందిన కీలక, సీనియర్ నేతగా.. మంత్రిగా వ్యవహరిస్తున్న అంబటికి టికెట్ రాదని.. జగన్ మొండిచేయి చూపిస్తున్నారని తెలియడంతో ఆయన అభిమానులు, అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ రాంబాబును ఎందుకు సైడ్ చేయాలని జగన్ భావిస్తున్నారు..? ఈయన స్థానంలో ఎవర్ని అభ్యర్థిగా బరిలోకి దింపాలని సీఎం మనసులో ఉంది..? అభ్యర్థి ఎంపికలో అసలు జగన్ ఏ పద్ధతిని ఫాలో అవుతున్నారన్న ఇంట్రెస్టింగ్ విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ (ABN Andhrajyothy) రాజకీయ కథనంలో తెలుసుకుందాం..
ఇదీ అసలు కథ..
అసమ్మతి.. అసంతృప్తి.. వ్యతిరేకతతో మంతి అంబటి రాంబాబుపై సత్తెనపల్లి నియోజకవర్గ (Sattenapalli Constituency) వైసీపీ నేతలు పోరాటానికి దిగుతున్న విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’లో చాలా కథనలే చూసుంటాం. ‘మంత్రి మాకొద్దు’ అంటూ రాంబాబుకు వ్యతిరేకంగా నియోజకవర్గ వ్యాప్తంగా నేతలు స్వరం పెంచి వైసీపీ హైకమాండ్‌ను హెచ్చరిస్తూ వస్తున్నారు. దీంతో కొంతకాలంగా మంత్రిపై అసమ్మతి తారాస్థాయికి చేరింది. పార్టీలో గ్రూపులను పోత్సహిస్తున్నారని, ‘విభజించు పాలించు’ అన్న చందాన అంబటి వ్యవహరిస్తున్నరన్న ఆరోపణలున్నాయి. సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా మంత్రికి దూరమవుతున్నారు. ఈ ఎన్నికల్లో అంబటికి పార్టీ టిక్కెట్ లేదంటూ అసమ్మతి నేతలు విస్తృత ప్రచారం చేస్తున్నారు. ప్రధాన సామాజికవర్గ నేతలు సైతం.. రాంబాబుపై తిరుగుబాటు జెండా ఎగురవేశారు. మొత్తమ్మీద రాంబాబుకు చెక్ పెట్టేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయ్. సరిగ్గా ఈ పరిస్థితుల్లో ఓ బాంబ్ లాంటి వార్త బయటికి వచ్చింది. సత్తెనపల్లిలో అభ్యర్థి ఎవరైతే బాగుంటుందని వైసీపీ హైకమాండ్.. నియోజకవర్గ ప్రజలకు ఫోన్ కాల్స్ చేస్తూ సర్వే చేయడం ప్రారంభించింది.
ఏం తేలింది..?
ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మొదలైన రాంబాబు అవినీతి.. మంత్రి పదవి దక్కిన తర్వాత మరింత జోరుగా సాగిందన్నది ప్రధాన ఆరోపణ. ఇక్కడే అంబటికి వ్యతిరేకత మొదలైంది. ద్వితియ శ్రేణి నేతలను, కార్యకర్తలు.. మొత్తంగా నియోజకవర్గాన్ని రాంబాబు పట్టించుకున్న పాపాన పోలేదట. అక్రమంగా మైనింగ్ చేపట్టి ఇష్టానుసారం వ్యవహరించారని.. తద్వారా కొన్ని కొన్ని ఊర్లకు సరిహద్దులే మారిపోయాయట. అందుకే ‘గడప గడప’ ప్రోగ్రాంలో సొంత పార్టీ నేతలే పాల్గొనకుండా అడ్డుపడ్డారన్నది మనం వార్తల్లో చాలా సార్లే చూశాం. పండుగలకు అది కూడా సంక్రాంతికి వచ్చి అలా వచ్చి ఇలా డ్యాన్సులు వేస్తారే తప్ప ఆ తర్వాత నియోజకవర్గంలో కొన్ని మండలాలు, గ్రామాల్లో తిరగట్లేదు.. జనాల బాధలు పట్టించుకోవట్లేదని సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు చెబుతున్న మాటలు. ఇవన్నీ వైసీపీ చేయించిన ఫోన్ కాల్ సర్వేలో (Phone Call Survey) తేలాయని తెలియవచ్చింది. ‘సత్తెనపల్లిలో అంబటిపై వ్యతిరేకత పెరిగిపోయింది. ప్రజా బలం తగ్గిపోయింది. టికెట్ ఇస్తే చేజేతులా సీటు పోగొట్టుకోవడమే’ అని సర్వేలో తేలిందని సమాచారం. దీంతో ఇక అంబటికి టికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదని వైసీపీ పెద్దలు ఫుల్ క్లారిటీకి వచ్చేశారని తెలియవచ్చింది.
అభ్యర్థి ఎవరో..?
సత్తెనపల్లి నుంచి పిన్నెల్లి వెంకటరామిరెడ్డిని (Pinnelli Venkatarami Reddy) బరిలోకి దింపాలని హైకమాండ్ భావిస్తోంది. ఇందులో భాగంగానే ఫోన్ కాల్ సర్వేలో ‘మీ నియోజకవర్గం నుంచి పిన్నెల్లిని అభ్యర్థిగా నిలిపితే బలపరుస్తారా..? లేకుంటే అంబటి రాంబాబే కావాలా..?’ అని నియోజకవర్గ ప్రజలను అడగ్గా.. ప్రతి 100లో 90 కాల్స్ మార్చాల్సిందేనని చెప్పినట్లు సర్వే సమాచారం లీకయ్యింది. దీంతో అంబటి రాంబాబు ఔటయినట్లేనని.. అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత ఏం చేయబోతున్నారనే నియోజకవర్గంలో పెద్ద చర్చే జరుగుతోంది. కాగా.. పిన్నెల్లి సోదరుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Rama Krishna Reddy Pinnelli) మాచర్ల ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో అన్నకు అన్నీ తానై చూసుకుంటూ వస్తున్న వెంకటరామిరెడ్డిని రాజకీయంగా పైకి తీసుకురావాలని భావించిన ఎమ్మెల్యే .. తన మనసులోని మాటను జగన్‌కు చెప్పారట. ప్రస్తుతం సత్తెనపల్లి విషయంలో పెద్ద పంచాయితీనే నడుస్తుండగా.. ఇదే నియోజకవర్గం నుంచి పరిశీలించాలని కూడా రామకృష్ణారెడ్డి చెప్పారట. అప్పటికే అంబటిపై తీవ్ర వ్యతిరేకత నడుస్తుండటం.. వద్దంటే వద్దని.. టికెట్ ఇస్తే ఓడిస్తామని సొంత పార్టీ నేతలు చెబుతున్న పరిస్థితుల్లో రెండ్రోజులుగా సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలతో ఫోన్ కాల్‌లో మాట్లాడి అభిప్రాయాలను తెలుసుకోవడం వైసీపీ హైకమాండ్ ప్రారంభించింది. అటు సర్వేలో అడ్రస్ లేకపోవడం.. ఇటు ప్రజాబలం లేకపోవడం.. అన్నింటికీ అవినీతిలో నంబర్ వన్ ప్లేస్‌లో ఉండటంతో టికెట్ ఇవ్వకూడదనే వైసీపీ పెద్దలు భావిస్తున్నారట. మరి తమ్ముడిని ఎమ్మెల్యేగా చూడాలన్న పిన్నెల్లి కోరిక.. జగన్ దగ్గర చక్రం తిప్పుతున్న రామకృష్ణారెడ్డి ఏ మేరకు సక్సెస్ అవుతారు..? మంత్రి, సీనియర్ నేత కావడంతో ఈ ఒక్కసారి అందర్నీ కలుపుకొని పోవాలని అంబటికే ఛాన్స్ ఇస్తారో..? తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.
Revanth Govt: భట్టీ కీలక ప్రకటన.. మహిళలకు మరో అదిరిపోయే గుడ్ న్యూస్
Siddam Sabha: రాప్తాడు ‘సిద్ధం’ సభలో వైఎస్ జగన్‌కు ఊహించని షాక్!
మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి