Home » APSPDCL
కుప్పంలో పైలెట్ ప్రాజెక్టుగా సోలరైజేషన్‌ను అమలు చేసే దిశగా ఎస్పీడీసీఎల్, రెస్కో అధికారులు కసరత్తు మొదలుపెట్టారు.
ప్రభుత్వ ఉద్యోగికి బదిలీ సహజం. అయితే రాజకీయ నాయకులను, అధికారులను డబ్బుతో గుప్పెట్లో పెట్టుకున్న అధికారులు ఏళ్లు గడుస్తున్నా అదే ఏరియాలో తిష్టవేస్తున్నారు. మేం ఎన్నేళ్లయినా ఉంటాం, ఏం పీక్కుంటారో పీక్కోండి అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు.
గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల సమయంలో విద్యుత సబ్‌స్టేషన్లు గురించి పట్టించుకోకుండా ఎన్నికల సమయంలో హడావిడిచేసి చివరికి చేతులెత్తేసిన వైనం తంబళ్లపల్లె నియోజక ర్గంలో చోటుచేసుకుంది.
విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి గొట్టిపాటి రవి కుమార్(Minister Ravi Kumar) శనివారం వర్చువల్ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా కరెంట్ షాక్‌తో చనిపోయిన వారి వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు.
లైన్‌మెన్ కూర రామయ్య(Lineman Kura Ramaiah) చేసిన సాహనం ఏపీ విద్యుత్ ఉద్యోగులందరికీ ఆదర్శనీయమని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్(Gottipati Ravi Kumar) అన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరద ప్రవాహాన్ని సైతం లెక్కచేయకుండా విద్యుత్ తీగలపై నడిచివెళ్లి కరెంట్ పునరుద్ధరించడాన్ని మంత్రి కొనియాడారు.
దాదాపు ఐదేళ్లుగా విద్యుత్ చార్జీల మోత మోగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల వేళ కూడా వినియోగదారులను వదిలిపెట్టలేదు.