Minister Ravi Kumar: లైన్‌మెన్ రామయ్య సాహనం ప్రశంసనీయం: మంత్రి గొట్టిపాటి
ABN , Publish Date - Jul 28 , 2024 | 05:20 PM
లైన్‌మెన్ కూర రామయ్య(Lineman Kura Ramaiah) చేసిన సాహనం ఏపీ విద్యుత్ ఉద్యోగులందరికీ ఆదర్శనీయమని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్(Gottipati Ravi Kumar) అన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరద ప్రవాహాన్ని సైతం లెక్కచేయకుండా విద్యుత్ తీగలపై నడిచివెళ్లి కరెంట్ పునరుద్ధరించడాన్ని మంత్రి కొనియాడారు.
అమరావతి: లైన్‌మెన్ కూర రామయ్య(Lineman Kura Ramaiah) చేసిన సాహనం ఏపీ విద్యుత్ ఉద్యోగులందరికీ ఆదర్శనీయమని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్(Gottipati Ravi Kumar) అన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరద ప్రవాహాన్ని సైతం లెక్కచేయకుండా విద్యుత్ తీగలపై నడిచివెళ్లి కరెంట్ పునరుద్ధరించడాన్ని మంత్రి కొనియాడారు. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఇటీవల భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే.
ఆ వర్షాలకు పలు జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. పంటలు నీట మునిగి రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అలాగే పలు గ్రామాలకు విద్యుత్ అంతరాయం ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆ సమయంలో అల్లూరి జిల్లా సున్నంపాడు, దేవరపల్లికి మధ్య నిలిచిపోయిన విద్యుత్‌ను ప్రాణాలకు సైతం తెగించి రామయ్య పునరుద్ధరించిన సంగతి మంత్రి రవికుమార్ దృష్టికి వచ్చింది. దీంతో ఎక్స్(ట్విటర్) వేదికగా మంత్రి ప్రశంసల వర్షం కురిపించారు.
ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ.."ప్రజలకు సేవ చేసేందుకు తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని లైన్ మన్ రామయ్య నిరూపించారు. ఆయన చేసిన సాహనం తోటి ఉద్యోగులు అందరికీ ప్రత్యక్ష ఉదాహరణ. వరద ఉద్ధృతిని సైతం లెక్క చేయకుండా తీగలపై నడిచి విద్యుత్ పునరుద్ధరించిన రామయ్యకు అభినందనలు. ఆయన సాహసం ఇతర ఉద్యోగులకు ఆదర్శనీయం. సంక్షోభం నుంచి ఎలా బయటపడాలనే విషయంలో అందరికీ ఆయన స్ఫూర్తిగా నిలిచారు. ప్రజావసరాలను తీర్చడంలో ఎన్డీయే ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందు ఉంటుందని రామయ్య నిరూపించారు.
భారీ వర్షాలకు అల్లూరి జిల్లా సున్నంపాడు, దేవరపల్లికి విద్యుత్ నిలిచిపోయింది. అక్కడి ప్రజలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోయారు. ఈ తరుణంలో ఏపీఈపీడీసీఎల్ పరిధిలో పనిచేస్తున్న లైన్ మెన్ రామయ్య వరద ఉద్ధృతిని లెక్క చేయలేదు. విద్యుత్ పునరుద్ధరణే లక్ష్యంగా తీగలపై నడుచుకుంటూ వాగు దాటి కరెంట్ సేవలు పునరుద్ధరించారు. విధి నిర్వహణలో రామయ్య చూపిన సాహసం, తెగువ ప్రతి ఒక్కరూ అలవరచుకోవాలి. కష్టపడిన వారికి ఎప్పటికైనా గుర్తింపు వస్తుంది. ఈ ఘటన ఎంతో మంది ఉద్యోగుల్లో చైతన్యం నింపుతుందని ఆశిస్తున్నా" అని ఎక్స్ వేదికగా ఆయన ప్రశంసించారు.
ఇది కూడా చదవండి:
Road Accident: కాకినాడ జిల్లాలో దారుణం.. ముగ్గురు అన్నదమ్ములు మృతి..