Home » Awards
తల్లిదండ్రుల తర్వాత గురువు లకే అగ్రపీఠమని, భావితరాలను ఉత్తమ విద్యార్థులుగా తీర్థిదిద్దేది గురువులేనని వక్తలు వ్యాఖ్యానించారు. ఎర్రగుం ట్ల మానవత యూనిట్ ఉపాధ్యాయులను సన్మానించింది. డాక్టర్ సర్వేపల్లి రాధాక్రిష్ణన్ జయంతి పురస్కరించుకుని విశ్రాంత డిప్యూటీ డీఈఓ బి.మునిరెడ్డి, ఉపాధ్యాయులు ప్రభాకర్‌రెడ్డి, భారతి, సాంబశివుడును సత్కరించారు.
జానపద సాహిత్య పరిషత, హైదరాబాదు ఆధ్వర్యంలో కూకట్పల్లి సింధూరి సంకల్ప లలిత కళానిలయంలో సోమవారం ఉదయం నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పూర్వ ముఖ్య సలహాదారు డాక్టర్ రమణాచారి చేతుల మీదుగా జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు ప్రొఫెసరు మూల మల్లిఖార్జునరెడ్డి, జానపద సాహిత్య పురస్కారాన్ని స్వీకరించారు.
సినిమా రంగంలో గద్దర్ అవార్డుల కోసం విధివిధానాలు, నియమ నిబంధనలను ఖరారు చేసేందుకు ప్రముఖ చిత్ర దర్శకుడు బి.నర్సింగ్‌రావు చైర్మన్‌గా రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది.
సృజనాత్మకతతో తీసే ఫొటో పాఠకుల్ని ఆలోచింపజేస్తుందని, వార్తా చిత్రాలకు ప్రజలను ప్రభావితం చేస్తూ భావోద్వేగాలను రేకెత్తించే శక్తి ఉంటుందని సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి అన్నా రు.
ప్రజాశక్తి పూర్వ సంపాదకులు మోటూరు హనుమంతరావు స్మారక ఉత్తమ జర్నలిస్టు పురస్కారానికి ‘ఆంధ్రజ్యోతి’ సీనియర్ రిపోర్టర్ కారుసాల వెంకటేష్ ఎంపికయ్యారు.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దక్షిణ మధ్య రైల్వేలోని ఇద్దరు పోలీసులకు ప్రతిష్ఠాత్మక ఇండియన్ పోలీస్ మెడల్ లభించింది.
స్టార్ ఆస్పత్రికి చెందిన డా.లోకేశ్వరరావు సజ్జాకు వైద్య పరిశోధనలో చేసిన కృషికి 2024 సంవత్సరానికి బ్లాక్‌బక్ అవార్డు(బ్లాక్‌బక్ పయనీర్ రీసెర్చర్ అవార్డు) దక్కింది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
అభ్యుదయ కవి దాశరథి కృష్ణమాచార్య జయంతి సందర్భంగా ఏటా ఇచ్చే పురస్కారాన్ని ఈ ఏడాది ప్రముఖ కవి, రచయిత జూకంటి జగన్నాథంకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రష్యా అత్యున్నత పౌర పురస్కారం 'ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్'ను మంగళవారంనాడు అందుకున్నారు. మాస్కోలోని క్రెమ్లిన్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ చేతుల మీదుగా మోదీ ఈ పురస్కారం అందుకున్నారు.
సింగరేణి ప్రాంతంలో 18 వేలకు పైగా మొక్కలు నాటించి, 6 జిల్లాల్లో 35 చిట్టడవులను పెంచడంలో కీలకంగా వ్యవహరించినందుకుగాను సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ ట్రీ మాన్ ఆఫ్ తెలంగాణ అవార్డును అందుకున్నారు.