Share News

Pawan Response On Chiru Award: అన్నకు అవార్డుపై.. తమ్ముడి స్పందన

ABN , Publish Date - Mar 20 , 2025 | 12:57 PM

Pawan Response On Chiru Award: టాలీవుడ్ అగ్రకథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి లైఫ్‌ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకోవడంపై తమ్ముడు పవన్‌ కళ్యాణ్ స్పందించారు. చిరుకు తమ్ముడికి పుట్టినందుకు ఎంతో గర్వంగా ఉందని అన్నారు పవన్.

Pawan Response On Chiru Award: అన్నకు అవార్డుపై.. తమ్ముడి స్పందన
Pawan Response On Chiru Award

అమరావతి, మార్చి 20: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) అరుదైన అవార్డును అందుకున్నారు. సుమారు 40 ఏళ్లకు పైగా తెలుగు సినిమా రంగానికి ఆయన అందిస్తున్న విశేష సేవలనుగానూ లైఫ్‌ టైమ్ అచీవ్‌మెంట్‌ పురస్కారాన్ని అందుకున్నారు మెగాస్టార్. యూకేకు చెందిన అధికార లేబ‌ర్ పార్టీ పార్ల‌మెంట్ మెంబ‌ర్ న‌వేందు మిశ్రా.. చివరంజీవి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ పురస్కారం అందుకున్న అన్న చిరంజీవికి తమ్ముడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) అభినందలను తెలియజేశారు. ట్వీట్టర్ వేదికగా చిరు అవార్డుపై పవన్ స్పందిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. చిరుకు తమ్ముడిగా పుట్టినందుకు ఎంతో గర్వంగా ఉందన్నారు. భవిష్యత్తులో మరిన్ని పురస్కరాలు అందుకోవాలని పవన్ ఆకాంక్షించారు.


పవన్ ట్వీట్ ఇదే..

‘మీ తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది. జీవిత సాఫల్య పురస్కారం అన్నయ్య గారి కీర్తిని మరింత పెంచనుంది. నేను చిరంజీవి గారిని ఒక అన్నయ్య గా కంటే ఒక తండ్రి సమానుడిగా భావిస్తాను. నేను జీవితంలో ఏం చేయాలో తెలియక, అయోమయంలో ఉన్న పరిస్థితుల్లో నాకు మార్గం చూపించిన వ్యక్తి ఆయన. ఆయనకు అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో ఆయన మరిన్ని పురస్కారాలు అందుకుని మా అందరికీ మార్గదర్శిగా ఉండాలని కోరుకుంటున్నాను’ అంటూ ఎక్స్‌ వేదికగా పవన్ ట్వీట్ చేశారు.


పవన్ ఇంకా ఏమన్నారంటే...

సాధారణ మధ్యతరగతి ఎక్సైజ్ కానిస్టేబుల్ కొడుకుగా జీవితం మొదలుపెట్టి, స్వశక్తితో, కళామతల్లి దీవెనలతో, చిత్ర రంగంలో మెగాస్టార్‌గా ఎదిగి, నాలుగున్నర దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను అలరిస్తూ, తన నటనతో ఉత్తమ నటుడిగా 9 ఫిలింఫేర్ అవార్డులు, 3 నంది అవార్డులు అందుకుని, నటనకు పర్యాయపదంగా నిలిచిన వ్యక్తి చిరంజీవి అని అన్నారు. ఆయన తమ్ముడిగా పుట్టినందుకు ఎప్పుడూ గర్విస్తూనే ఉంటానని తెలిపారు. ‘నా జీవితానికి హీరో అన్నయ్య చిరంజీవి. తన సేవా భావంతో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించడం ద్వారా ఆపదలో ఉన్నవారికి రక్తదానం, నేత్రదానం అందిస్తూ, నన్నే కాకుండా కోట్లాదిమంది అభిమానులను సమాజ సేవకులుగా మార్చిన స్ఫూర్తి ప్రదాత మా అన్నయ్య కొణిదల చిరంజీవి. తాను ఎదగడమే కాకుండా తన కుటుంబంతో పాటుగా, ఎంతోమంది ఎదుగుదలకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయ సహకారాలు అందిస్తూ, టాలెంట్ ఉన్న ఎవరైనా సరే ఏ రంగంలో అయినా సరే రాణించవచ్చు అనేందుకు ఉదాహరణగా నిలిచారు. ఆయన సమాజానికి అందించిన సేవలకు గాను ఇటీవలే భారత ప్రభుత్వం రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ పురస్కారాన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ చేతుల మీదుగా అందుకున్నారు అని తెలిపారు.


పద్మవిభూషణ్ డా. మెగాస్టార్ చిరంజీవి ఈనెల 19న జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించిన వార్త తనకెంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. ఈ సందర్భంగా ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో ఆయన మరిన్ని పురస్కారాలు అందుకుని అందరికీ మార్గదర్శిగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ పురస్కార కార్యక్రమానికి హోస్‌ట్‌గా వ్యవహరిస్తున్న స్టాక్ పోర్ట్ ఎంపీ నవేందు మిశ్రాకు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.


ఇవి కూడా చదవండి...

Betting Apps: బిగ్ బ్రేకింగ్.. రానా, ప్రకాష్ రాజ్‌పై కేసు నమోదు..

Bank Holidays: నాలుగురోజులు నిలిచిపోనున్న బ్యాంకు సేవలు.. ఎందుకంటే

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 20 , 2025 | 01:12 PM