Home » Bangladesh
బంగ్లాదేశ్లో రాజకీయ సంక్షోభం కారణంగా షేక్ హసీనా తన ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆమె బంగ్లాదేశ్ నుంచి మళ్లీ సుమారు ఐదు దశాబ్ధాల తర్వాత ప్రాణ రక్షణ కోసం భారత్ చేరుకుంది. బంగ్లాదేశ్ నుంచి సైనిక విమానంలో భారత్కు వస్తున్న క్రమంలో హసీనా వెంట తన చెల్లి రెహానా ఉన్నారు.
బంగ్లాదేశ్లో రాజకీయ సంక్షోభం ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారీ విజయాన్ని సాధించిన తర్వాత షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు మొదలవ్వడం.. ఆందోళనల కారణంగా షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి.. ప్రాణరక్షణ కోసం పొరుగు దేశానికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
బంగ్లాదేశ్లో(Bangladesh Crisis) రాజకీయ సంక్షోభం, హింసాత్మక నిరసనలు, ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేయడం ఇవన్నీ.. భారత వ్యాపార వర్గాలపై తీవ్ర ప్రభావం చూపాయి. షేక్ హసీనా తొలిసారి 2009లో అధికారం చేపట్టినప్పటి నుంచి, బంగ్లాదేశ్ భారత్కి కీలక మిత్రదేశంగా ఉంది.
శ్రీలంక ఆర్థిక సంక్షోభంపై పెద్ద ఎత్తున జరిగిన నిరసనలు .. చివరకు మాజీ అధ్యక్షుడు గొటాబయ రాజపక్ష దేశం విడిచి మిలిటరీ జెట్లో పారిపోయేలా చేశాయి. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా వ్యవహారంలో అచ్చం ఇలాగే జరిగింది.
రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలతో ప్రధాని పదవికి రాజీనామా చేసి రక్షణ నిమిత్తం భారత్కి వచ్చిన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina)కు సంబంధించిన పలు అంశాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
బంగ్లాదేశ్లో చోటు చేసుకున్న తాజా పరిణామాలపై మంగళవారం రాజ్యసభలో కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్ ఓ ప్రకటన చేశారు. ఆ దేశంలో మొత్తం 19 వేల మంది భారతీయులు ఉన్నారని తెలిపారు. వారితో ప్రభుత్వం టచ్లోనే ఉందని వివరించారు.
ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అంశంపై బంగ్లాదేశ్లో మొదలైన నిరసన.. ఆ దేశ ప్రధానిని గద్దె దింపే వరకు కొనసాగింది. ఓ విద్యార్థి ఉద్యమం ఉవ్వెత్తున కొనసాగడంతో ఓ ప్రధాని తన పదవికి రాజీనామా చేసి.. ప్రాణ రక్షణ కోసం పొరుగు దేశానికి వెళ్లడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.
బంగ్లాదేశ్లో విద్యార్థులు చేపట్టిన వరుస ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. దీంతో ఆ దేశ ప్రధాన మంత్రి పదవికి షేక్ హాసినా రాజీనామా చేశారు. దీంతో ఆ దేశంలో మధ్యంత ప్రభుత్వం కొలువు తీరనుంది. అలాంటి వేళ విద్యార్థి సంఘాల వేదిక ‘యాంటీ డిస్క్రిమినేషన్ స్టూడెంట్ మూవ్మెంట్’ మంగళవారం ప్రభుత్వాధికారుల ఎదుట కీలక ప్రతిపాదన చేసింది.
బంగ్లాదేశ్ అల్లర్ల నేపథ్యంలో కేంద్ర విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్ ఇవాళ(మంగళవారం) అఖిలపక్ష నేతలను కలవనున్నారు. దీనికి సంబంధించి ఆ దేశ పరిస్థితులను ఇప్పటికే ఆయన నిశితంగా పరిశీలిస్తున్నారు. బంగాదేశ్ పరిస్థితులపై విదేశాంగ, హోంశాఖ, రక్షణ శాఖ మంత్రులతోపాటు ఉన్నతాధికారులతో ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే సమీక్ష నిర్వహించారు.
బంగ్లాదేశ్ను కుదిపేస్తున్న ప్రస్తుత పరిణామాలకు ‘ముక్తియోధుల కోటా’పై ఆగ్రహమేనా? అంటే.. రిజర్వేషన్ల అంశం పైకి కనిపించే స్థూల కారణం మాత్రమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు!