Home » Basara Gnana Saraswati
కాశీ పుణ్యక్షేత్రంలో నిరంతరాయంగా జరుగుతున్న గంగా హారతి మాదిరిగా గోదావరి పరివాహక ప్రాంతంలో వెలసిన బాసర(Basara) పుణ్యక్షేత్రంలో నిత్య గంగా (గోదావరి) హారతి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నట్లు నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీ వేద భారతీ పీఠం పండితుడు, అధ్యాపకుడు గురుచరణ్ తెలిపారు.
Telangana: పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి కమలం పార్టీ శ్రీకారం చుట్టింది. నేటి నుంచి మార్చి 2 వరకు విజయసంకల్ప యాత్ర పేరుతో రథయాత్రలు చేపట్టాలని నిర్ణయించింది. అందులో భాగంగా మంగళవారం ఉదయం బాసర సరస్వతీ దేవి ఆలయం నుంచి బీజేపీ విజయసంకల్ప యాత్ర ప్రారంభమైంది.
Telangana: బాసర సరస్వతీ అమ్మవారిని ఎంపీ సోయం బాపు రావు, బీజేపీ నేతలు మంగళవారం ఉదయం దర్శించుకున్నారు. దర్శనానంతరం ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో ఎంపీ సోయంబాపురావు మాట్లాడుతూ.. విజయ సంకల్ప యాత్రలతో పార్లమెంట్ ఎన్నికల శంఖారావం పూరిస్తున్నామన్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో 10 స్థానాల్లో పాగా వే యాలని బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ మరో రెండు నెలల్లో వెలువడనుంది. ఈ నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీలు ఎన్నికలకు సన్నద్ధమవుతున్నా యి. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం మరోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించేందుకు బీజేపీ అధిష్ఠానం ప్రణాళికలు రూపొందించింది.
నిర్మల్ జిల్లా బాసర సరస్వతి ఆలయం వివాదాలకు కేరాఫ్‌గా మారుతోంది..! రెండ్రోజులకో వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటున్న పరిస్థితి..