TS News: నేడు బాసర నుంచి విజయ సంకల్ప యాత్ర ప్రారంభం..
ABN , Publish Date - Feb 20 , 2024 | 07:41 AM
పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో 10 స్థానాల్లో పాగా వే యాలని బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ మరో రెండు నెలల్లో వెలువడనుంది. ఈ నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీలు ఎన్నికలకు సన్నద్ధమవుతున్నా యి. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం మరోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించేందుకు బీజేపీ అధిష్ఠానం ప్రణాళికలు రూపొందించింది.
బాసర: పార్లమెంట్ ఎన్నికల్లో (Parliament Elections) రాష్ట్రంలో 10 స్థానాల్లో పాగా వే యాలని బీజేపీ (BJP) తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. లోక్‌సభ (Loksabha) ఎన్నికల షెడ్యూల్ మరో రెండు నెలల్లో వెలువడనుంది. ఈ నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీలు ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం (NDA Government) మరోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించేందుకు బీజేపీ అధిష్ఠానం ప్రణాళికలు రూపొందించింది. ఈ మేరకు జాతీయ స్థాయి సమావేశాల్లో దేశవ్యాప్తంగా 400 ఎంపీ స్థానాలను కైవసం చేసుకునేలా పార్టీ నేతలు సంసిద్ధులు కావాలని అధిష్ఠానం పిలుపునిచ్చింది.
ఇక తెలంగాణలో నేటి నుంచి బీజేపీ (BJP) విజయసంకల్ప యాత్రను ప్రారంభించనుంది. బాసర (Basara) నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. సరస్వతీ దేవి ఆలయంలో పూజలు చేసి యాత్రను బీజేపీ నేతలు ప్రారంభించనున్నారు. భైంసాలో ప్రారంభ సభకు అస్సాం సీఎం (Assam CM) హేమంత బిస్వా శర్మ హాజరు కానున్నారు. ఆదిలాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో యాత్ర సాగనుంది.